కాకినాడ : కోరమండల్ ఎరువుల కర్మాగారంలో సోమవారం అర్థరాత్రి అమ్మోనియం వాయువు లీకైంది. దీంతో ఈ విషవాయువు కారణంగా ఇద్దరు మృతి చెందారు. పలువురు అస్వస్థతకు గరయ్యారు. వీరిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కర్మాగారం సమీపంలో విషవాయువ ప్రభావానికి చాలా మంది ఊపిరి ఆడని పరిస్థతిలో ఉన్నట్లు సమాచారం. కర్మాగారం వద్ద 108 వాహనాలు అందుబాటులో ఉంచారు. వైద్య సిబ్బంది అత్యవసర సేవలు అందిస్తున్నారు.