ఆర్ధిక సర్వేకి ఉపా బ్రేక్
ఆ బడ్జెట్ ల ద్వారా ప్రజల అభిప్రాయాన్ని ఉపా ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకునేందుకు అవకాశముంటుంది. మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టే అవకాశాన్ని ప్రభుత్వం జారవిడుచుకోదని ఆర్ధిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలియజేశారు.మధ్యంతర బడ్జెట్ కు ముందు ఆ తరాత కూడా ఉద్దీపన ప్యాకేజి సంబంధించిన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోవచ్చని ఆర్ధిక కార్యకలాపాల కార్యదర్శి అశోక్ చావ్లా తెలపారు.ఈ ప్యాకేజి మధ్యంతర బడ్జెట్లలో సాధ్యం కాకపోతే విడిగా సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుత పరిస్థతుల్లో ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టాల్సి ఉన్నప్పటికీ,మద్యంతర వార్షిక సర్వే ఈ మధ్యనే విడుదలయ్యింది కాబట్టి, ఓట్-ఆన్-అకౌంట్ తోపాటు ప్రభుత్వం ఆర్దిక సర్వేను ప్రవేశపెట్టాల్సిన అవసరంలేదు. ఆయితే, 'ఫిసికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్'చట్టం ప్రకారం ఆర్ధిక వ్యవస్థ త్రైమాసిక సమీక్ష తప్పనిసరిగా ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ కు ముందు ప్రవేశపెట్డడం చట్టబద్దమైన వ్యవహారంగా ఉంటుంది. రుణ సేకరణను తగ్గించుకునే లక్ష్యం నీరుగారిపోయిన విషయం ప్రభుత్వానికి అర్ధమయ్యే అవకాశముంటుంది. అర్దిక ఉదాసీనంగా ఉండే భారత ఆర్ధిక వ్యవస్థను సూచించే ఆర్ధిక సర్వేని ఎన్నికల ముందు నిర్వహించి తన గొయ్యిని తానే తీసుకునేందుకు ఉపా ప్రబభుత్వం సిద్ధంగా లేదు.
Pages: -1- -2- 3 News Posted: 10 February, 2009
|