ఆర్ధిక సర్వేకి ఉపా బ్రేక్
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఉపా ప్రభుత్వం సాధించిన ఆర్ధిక ప్రగతి శూన్యం.2008 జనవరి నుండి స్టాక్ మార్కెట్లు 'షాక్ మార్కెట్లు'గా మారాయి. ప్రపంచ సరుకుల ధరలు పెరగడం, రిజర్వ్ బ్యాంక్ అదనంగా ద్రవ్యాన్ని మార్కెట్ లోకి విడుదల చేయడంతో ఈ ఆర్ధిక సంవత్సరం తొలి భాగమంతా ద్రవ్యోల్బణాన్ని తగ్గించే పోరాటంలో గడచి పోయింది. ఇది గృహ, వ్యక్తిగత రుణాలపై ప్రతికూల ప్రతికూల ప్రబావమేసింది. 2008 సెప్టెంహర్ నుండి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దేశ ఆర్థిక ప్రగతిని వెనక్కి మళ్లించింది. దాంతో ప్రభుత్వం రెండు ఉద్దీపన పాకేజీలను ప్రకటించాల్సి వచ్చింది.
గత ఏడాది 8.1 శాతంగా ఉన్న సరకుల ఉత్పత్తి రేటు ప్రస్తతం 4.8 శాతానికి పడిపోయింది. అదే విధంగా 2007-08 సంవత్సరంలో 4.9 శాతంగా ఉన్న వ్యవసయోత్పత్తి 2.6 శాతానికి తగ్గనుందన్న ఆర్ధిక అంచనాలు గ్రామీణ ఓటు బ్యాంకును కూడా దెబ్బ తీస్తుంది. దేశ ఆర్ధిక ప్రగతికి ప్రధాన కారణమైన సర్వీసెస్ రంగం 11 శాతం నుండి 9.6 శాతానికి క్షీణించనుంది. ఈ రంగంలో పెద్ద ఎత్తుల తగ్గుదల కనపడనప్పటికీ, అత్యన్నంతంగా ఉద్యోగాలు ఆవిరికానున్నాయి. కొత్త ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టేదాకా డబ్బు వినియోగానికి సంబంధించి వోట్-ఆన్-అకౌంట్ గాని, రైల్వే బడ్జెట్లు ఉపయోగపడుతాయి.
Pages: -1- 2 -3- News Posted: 10 February, 2009
|