అద్వానీ టీమ్ లో ఐఐఎమ్
కోలకతా: లోక్ సభ ఎన్నికల తేదీలను ప్రకటించినప్పుడు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం)కలకత్తా విద్యార్థి ఒకరు ఒక ఇంటర్న్ షిప్ ను ప్రారంభించగలరు. అటువంటి ప్రయత్నం ఇంతకుముందు ఎవరూ చేసి ఉండరు. అటువంటిది ఎవరూ ఆకాంక్షించి ఉండరు కూడా. ఐఐఎం-సి నుంచి ఈమధ్యే ఉత్తీర్ణుడైన హర్ష్ వర్ధన్ ఛాపరియా భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రధాని అభ్యర్థి ఎల్.కె. అద్వానీ ప్రచార బృందంలో చేరనున్నారు. ఈ మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్ మార్చిలో చేపట్టనున్న బాధ్యత ఇది.
అద్వానీని విపరీతంగా అభిమానిస్తానని చెప్పుకుంటున్న హర్ష్ ఈ క్షణం కోసం పెక్కు మాసాలు కలలు కని చివరకు ఫోన్ అందుకుని క్రితం నెల లోక్ సభలోని ప్రతిపక్ష నాయకుడు అద్వానీతో సమావేశానికి అనుమతిని కోరారు. సమాధానం వెంటనే వస్తుందని హర్ష్ ఊహించలేదు. 'జనవరి 30న కలుసుకోవలసిందిగా ఆయన మంచి మనసుతో సూచించారు. తన ప్రచారంలో ఎందుకు చేరాలనుకుంటున్నారని ఆయన నన్నుఅడిగారు. నా ఉద్దేశాలను నేను స్పష్టంగానే చెప్పాను. భారతీయ రాజకీయాల గురించి కూలంకషంగా తెలుసుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు ఆయనతో చెప్పాను. మేనేజర్లు, రాజకీయ నాయకులు జనంతో కలసి పని చేస్తారు. ఆయన అంగీకరించారు' అని హర్ష్ తెలియజేశారు. హర్ష్ ఐఐఎం-సిలో స్టూడెంట్స్ కౌన్సిల్ కు అధ్యక్షుడు.
Pages: 1 -2- News Posted: 17 February, 2009
|