అద్వానీ టీమ్ లో ఐఐఎమ్
హర్ష్ ఢిల్లీలో అద్వానీని ఆయన నివాసంలో కలుసుకున్నప్పుడు ఆయన తన ఆత్మకథ 'మై కంట్రీ, మై లైఫ్' ప్రతి ఒకదానిని సంతకం చేసి మరీ ఇచ్చారు. 'ఆయన పని గట్టుకుని నన్ను తన లైబ్రరీకి కూడా తీసుకువెళ్ళారు' అని హర్ష్ చెప్పారు. హర్ష్ ను కలుసుకున్న విషయం నిజమేనని అద్వానీ చెప్పారు. 'అవును. ఆయన ఢిల్లీ వచ్చి నన్ను కలుసుకున్నారు. నా ప్రచార బృందంలో చేరాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన నాతో చెప్పారు.అయితే, మీరు నన్ను అడిగితే, ఆయన నిర్వర్తించవలసిన పాత్ర గురించి మేము ఇంకా నిర్ణయించవలసి ఉందని చెపుతాను. దీనిపై వ్యాఖ్యానించడం తొందరపాటే అవుతుంది. ప్రచార వ్యూహంపై అంతా ఆధారపడి ఉంటుంది' అని అద్వానీ తెలియజేశారు.
సింగపూర్ లోని నానియాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్న హర్ష్ కు రాజకీయాలు ఎప్పుడూ అభిమాన విషయం. ఆయన సింగపూర్ కాలేజీలో విద్యార్థుల సంఘానికి ఉపాధ్యక్షుడుగా ఉండేవారు. 'ఆయన వ్యవహార దక్షత గురించి నాకు అవగాహన ఉంది. ఆయన సవాళ్ళను ఎలా ఎదుర్కొంటారో ఆయన దగ్గర నుంచి నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను' అని హర్ష్ చెప్పారు. హర్ష్ ఇప్పుడు అద్వానీ గురించిన అవగాహన కోసం, ఆయన సిద్ధాంతాలను మరింతగా అర్థం చేసుకోవడం కోసం ఆయన ఆత్మకథను చదువుతున్నారు. 'ప్రజలను ప్రభావితం చేయడంలో నేర్పు గురించి ఈ మహామనీషి నుంచి నేర్చుకోవాలని కోరుకుంటున్నాను' అని హర్ష్ చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ఆయన ఒక గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థలో కొత్త పదవి చేపట్టనున్నారు.
Pages: -1- 2 News Posted: 17 February, 2009
|