పోస్టాఫీసుకు కొత్త కళ
పోస్టాఫీసుల పైపై రూపు రేఖలే కాదు, దాని పనితీరు కూడా అధునాతనంగా మారనుంది. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిక్షానంతో కూడిన వినియోగదారల సేవలను పోస్టాఫీసులు అందించేందుకు సిద్దమవుతున్నాయి. ఇన్ స్టంట్ మనీ ఆర్డర్, మెయిల్ సౌకర్యాలు వినియోగదారులకు అందిస్తున్నాయి. ఈ మనీ ఆర్డర్లను అదే రోజు అందించే ఆధునిక సేవల్ని సైతం పోస్టాఫీసులు వినియోగదారులకు అందిస్తున్నాయి. విసుగు పుట్టే క్యూలతో వినియోగదారుల విలువైన కాలాన్ని హరించే పోస్టాఫీసుల పనివిధానం కూడా పూర్తిగా మారిపోతోంది. ఎలాంటి సర్వీసునైనా గరిష్టంగా అయిదు నిమిషాల్లో పూర్తి చేసే విధంగా పోస్టాఫీసు పని విధానాన్ని ఆధునీకరించారు. పోస్టమాస్టర్ జనరల్, చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్, మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ విషయాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.
ఇది కేవలం ఆరంభం మాత్రమే. దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాలతో సహా వీధి వీధికి కూడా ఒక 'మల్టీ పర్పస్ సెంటర్' (బహుళ ప్రయోజనాల కేంద్రం)గా పనిచేసే పోస్టాఫీసును ఏర్పరచే ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ఆ తర్వాత రిటైల్ వ్యాపారాన్ని కూడా పోస్టాఫీసుల ద్వారా సాగించాలన్నది ప్రభుత్వ పథకం. పట్టణ ప్రాంతాల్లోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కు సూక్ష్మ రూపంలో ఈ మారుమూల పోస్టాఫీసు కేంద్రాలు పనిచేస్తాయి.
'పోస్టాఫీసులకు అతి పెద్ద పంపిణీ యంత్రాంగం ఉంది. అయితే పరిశ్రమకు ఇప్పుడు అంతగా ఆసక్తి కలగలేదు. ప్రాజెక్ట యారో ద్వారా ఒక అత్యున్నత డెలివరీ టెక్నాలజీని అందిస్తాము. దాంతో ప్రైవేట్ రంగంలోని పలు సంస్థలతో భాస్వామ్యాన్ని కుదుర్చుకునేందుకు వీలవుతుంది. మేము పోస్టాఫీసులను ప్రపంచ గవాక్షాలుగా మార్చబోతున్నాము' అని సింథియా తెలిపారు. మధ్యప్రదేశ్ లోని పోస్టాఫీసులు ఎమ్ సిఎక్స్ కమాడిటి ఎక్చేంజ్ తో పొత్తు పెట్టుకుని కొన్ని వ్యవసాయోత్పత్తుల ధరలను ప్రకటించేవి. మధ్యంతర బడ్జెట్ లో కూడా ఈ ప్రాజెక్ట్ యారో గురించిన ప్రస్తావన ఉంది. ఈ పథకానికి కేంద్రం నుండి పూర్తి స్థాయి మద్దతు ఉందని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు.
Pages: -1- 2 News Posted: 20 February, 2009
|