ఐఐఎం ఫీజు 9 లక్షలు
కేంద్రం నుంచి అనుమతి లభించడాన్ని బట్టి ఫ్యాకల్టీ సంఖ్యను 88 నుంచి 120కి పెంచాలని కూడా సంస్థ నిర్ణయించింది. 'మేము త్వరలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హిచ్ ఆర్ డి) మంత్రిత్వశాఖతో ఈ విషయం ప్రస్తావిస్తాం' అని వర్మ తెలిపారు.
అజిత్ బాలకృష్ణన్ అధ్యక్షతన బోర్డు ఆ తరువాత ఫ్యాకల్టీ సభ్యులతో భార్గవ కమిటీ నివేదికపై చర్చించింది. 'నివేజికలో కొంత భాగంలో స్పష్టత కొరవడింది. దీనితో కమిటీ సిఫార్సులను ఆమోదించడానికి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కాని భార్గవ, ఐఐఎం కలకత్తా చైర్మన్ ఫ్యాకల్టీ అనుమానాలను తీర్చారు. ఫ్యాకల్టీ నివేదికపై చర్చించి ఏప్రిల్ లోగా సంబంధిత సిఫార్సులు చేస్తుంది' అని వర్మ తెలియజేశారు.
మారుతి ఉద్యోగ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భార్గవ నాయకత్వంలోని కమిటీ ఏ ప్రతిపాదిత హెచ్చింపునైనా 'అమలు చేయకుండా నిలిపి ఉంచవలసిందిగా' ఐఐఎంలు అన్నిటినీ కోరి ఉండకపోతే 2008-10 బ్యాచ్ కు ఫీజులో రూ. 3 లక్షల మేరకు హెచ్చింపును క్రితం సంవత్సరమే అమలుపరిచి ఉండేవారు.
Pages: -1- 2 News Posted: 21 February, 2009
|