'రాజ్యం' వెంటే మావోలు!
ఇక, ముందునుండి వర్గవైరం చూపుతున్న కమ్యూనిస్టు పార్టీలకు, నక్సలైట్ల అణచివేతలో ఎన్డియే ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించిన బిజెపికి కూడా వారు ్నుకూలంగా ఉండడానికి ఇష్టపడనట్టే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో మావోయిస్టుల వ్యవహారశైలిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం పార్టీని పెట్టి ఎన్నికల్లో పాల్గొనేందుకు పరుగులు తీస్తున్న ప్రజారాజ్యం పార్టీకి మద్దతు ప్రకటించే విషయమై ఇప్పుడు మావోయిస్టులు ఆలోతన చేస్తున్నట్టు కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రజారాజ్యం కూడా మావోయిస్టులపై ఎటువంటి ప్రకటనలు చేయడంలేదని తెలిసింది. మావోయిస్టులు త్వరలోనే తమ విదానాన్ని, వైఖరిని ప్రకటించవచ్చని సమాచారం.
ఇదిలా ఉండగా, మాజీ మావోయిస్టులు భారీ సంఖ్యలో ప్రజారాజ్యం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. హైదరాబాద్ లో మంగళవారం నిర్వహించనున్న ఒక సభలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,000 మంది మాజీ నక్సలైట్లు ప్రజారాజ్యంలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సంఘటన కూడా మావోయిస్టులు ప్రజారాజ్యవైపు ఆకర్షితులయ్యే అవకాశం కల్పించవచ్చునని విశ్లేషకుల అంచనా.
Pages: -1- 2 News Posted: 22 February, 2009
|