అద్వానీకి ఓ బ్లాగర్ లేఖ!
ముంబై : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాదిరిగా వెబ్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రధాని అభ్యర్థి ఎల్.కె. అద్వానీకి ప్రచారంలో లోటుపాట్లను ఎత్తిచూపుతూ ఒక బ్లాగర్ ఆయనకు ఒక లేఖ రాశారు. ఆ బ్లాగర్ లేఖ ఇలా సాగింది:
'ప్రియమైన ఎల్.కె. అద్వానీ గారూ, 'అద్వానీ కోసం బ్లాగర్లు' కార్యక్రమంలో భాగం కావలసిందిగా కోరుతూ మీ కమ్యూనికేషన్ల బృందం ఇటీవల పంపిన ఇ-మెయిల్ కు చాలా చాలా ధన్యవాదాలు. నేమ చేయవలసిందేమిటో మీ బృందం వివరించింది. నేను మీ రాజకీయ వేదికను, విశ్వాసాలను సమర్థిస్తున్నట్లు తెలియజేయడానికై నా బ్లాగ్ పై ఒక చక్కటి, గుండ్రటి ఆరంజ్ బ్యాడ్జిని అమర్చుకోవాలని వారు సూచించారు. నా వంటి బ్లాగర్లను చేరుకోవడానికి మీ బృందం చేస్తున్న కృషిని, మీ ప్రచార ప్రణాళికలో భాగంగా ఇంటర్నెట్ ను వినియోగించుకోవడాన్ని నేను అభినందిస్తున్నాను. అయితే, మా వర్గం (కానిస్టుయెన్సీ) కి ప్రాముఖ్యం లేదన్న విషయం చాలా మంది బ్లాగర్లకు తెలుసని మీకు నివేదిస్తున్నాను.
మేము ఈ దేశంలో విపరీతంగా మీడియా కవరేజిని పొందుతుండవచ్చు. కాని ఈ దేశంలో 50 వేల మంది క్రియాశీల బ్లాగర్లు మాత్రమే ఉన్నారని గణాంకాలు సూచిస్తున్నాయి. అందువల్ల, గులాబీ చెడ్డీల కోసం మేము మార్కెట్ లో హడావుడి చేయగలమేమో గాని మాకుగా మేము ఒక పార్టీని అధికారంలోకి తెప్పించలేని అశక్తులం. బ్లాగర్లకు అందుబాటులోకి రావడం ద్వారా, స్వయంగా బ్లాగ్ లో రాస్తుండడం ద్వారా మీరు ఈ దేశంలో మొదటిసారి వోటు హక్కు పొందిన పది కోట్ల మందికి పైగా వోటర్లను చేరుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు.
రాజకీయాలంటే రొచ్చు అని, రాజకీయ నాయకులంటే విరక్తి భావంతో పెరిగిన ఈ యువ తరం ఏమాత్రం ఉత్సాహం లేకుండానే తమ వోటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఒక బ్లాగ్ వంటి ప్రజాస్వామిక, పారదర్శక వేదికను ఉపయోగించుకోవడం ద్వారా మీరు వారిని రాజకీయ కార్యాచరణకు పురికొల్పాలని ఆకాంక్షిస్తుండవచ్చు. కాని వైట్ హౌస్ లోకి ప్రవేశించడానికి ఇంటర్నెట్ ను వినియోగించుకున్న బరాక్ ఒబామాను మీరు స్ఫూర్తిగా తీసుకున్నట్లున్నది. ఆది ఆయనకు నిధుల సమీకరణకు కూడా దోహదం చేసింది. యువ జనులు ఐచ్ఛికంగా ముందుకు వచ్చి ఆయన తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.
Pages: 1 -2- News Posted: 22 February, 2009
|