అద్వానీకి ఓ బ్లాగర్ లేఖ!
అయితే, సార్!, నేను 'అద్వానీ కోసం బ్లాగర్ల' కార్యక్రమంలో పాల్గొనకపోవడానికి ఇదే కారణం. పిన్న వయస్కుడైన భారతీయుడుగా నేను పార్లమెంట్ లోకి డబ్బుల సంచులు తీసుకువచ్చే నిరర్థక రాజకీయాలను గాని, క్షేత్ర పర్యటనపై తాజ్ హోటల్ కు రామ్ గోపాలవర్మను తీసుకువెళ్ళడాన్ని చూడాలనుకోవడం లేదు. యువ భారతీయుడుగా నేను యువ మోర్చా కార్యకర్తలు నాసిరకం మౌలిక వసతుల పట్ల నిరసన తెలియజేయడానికి నాగపూర్ విశ్వవిద్యాలయాన్ని చిందరవందర చేయడాన్ని చూడాలనుకోవడం లేదు. (ఇందులో ఆంతర్యాన్ని మీరు గ్రహిస్తారని ఆశిస్తా). దేశంలో పేరు పెట్టి నిందలు వేయడాన్ని, వేలెత్తి చూపడాన్ని రాజకీయ చర్చగా సాగించే విధానానికి స్వస్తి చెబితే చూడాలనుకుంటున్నాను.
మీ హోమ్ పేజి అంతా కాంగ్రెస్ పై ద్వేషంతో చేసిన విమర్శలతో నిండిపోయి ఉంది. క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, దేనినీ పట్టించుకోని ప్రభుత్వం ఏవిధంగా తమ జీవితాలను దెబ్బ తీస్తున్నాయో వివరిస్తూ మీకు ఇమెయిల్ చేయవలసిందని ఒక సర్వే జనాన్ని కోరుతుంది. భారత్ నిర్మాణ్ పథకాన్ని ప్రచారమే తప్ప వేరేమీ కాదని మరొక వార్తాంశం పేర్కొంటుంది. డిస్ ప్లేలో ఉన్న మొదటి వార్తాంశం కాంగ్రెస్ పై ఫిర్యాదుల జాబితాతో కూడుకున్నది. మీరు అంత తెలివిగా మీ క్రీడా క్షేత్రాన్ని మార్చుకున్నప్పుడు మీరు గేమ్ ను కూడా ఎందుకు మార్చరు?
చివరకు మహా ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా తన దేశ ప్రజలలో ఆశావాదాన్ని నింపడం వల్లే ఒబామా అఖండ విజయం సాధించారేమో! మీ బ్లాగ్ తో, మీ వెబ్ సైట్ తో మీకు అలా చేసే శక్తి ఉంది. మేము చాలా కాలంగా మిస్సయిన రాజకీయాలను అందించడానికి, సరైన దృక్పథంతో అంశాలపైన భారతీయులు చర్చించేట్లు చేయడానికి మీకు అవకాశం ఉంది. ఒక వేళ మీరు అలా జాతీయం స్థాయిలో చేయలేకపోయినా, మీ బ్లాగ్ లో మీరు చేయగలరు. మీ ఆశల గురించి, ఆశయాకాంక్షల గురించి మాట్లాడండి. దీనిని మెరుగైన దేశంగా చేయడానికి మీరేమి చేయగలరో చెప్పండి. యువజనులు మీకు ఏవిధంగా దోహదపడగలరో మాకు సూచించండి. ఈ దేశం పట్ల మీకు గల దూరదృష్టి గురించి మాకు వివరించండి. అయితే, బ్లాగ్ లు అవీ 2007 నాటివని గ్రహించండి అద్వానీ గారూ. మేము ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నవారం.'
Pages: -1- 2 News Posted: 22 February, 2009
|