టాటా 'నానో' తీర్ధయాత్ర!
'మేము నానో కారులో పంత్ నగర్ నుంచి వచ్చాం' అని టాటా అధికారి తెలిపారు. కాగా అజ్మీర్ కు తీసుకువెళ్ళిన నానో కారును మహారాష్ట్రలోని పింప్రిలో తయారు చేశారు. దానిని ముంబై నుంచి జైపూర్ కు విమానంలో తరలించి ఆతరువాత అజ్మీర్ కు తీసుకువెళ్ళినట్లు టాటా మోటార్స్ స్థానిక డీలర్ తెలిపారు.
నానో కారును చూసేందుకు దారి పొడుగునా అధిక సంఖ్యలో జనం గుమిగూడారు. 'మేము లంచ్ లేదా టీకి ఎక్కడికి వెళితే అక్కడ వందలాది మంది కారు చుట్టూ చేరేవారు' అని టాటా అధికారి చెప్పారు. 'చాలా మంది టెస్ట్ డ్రైవ్ చేయాలని కోరుకున్నారు. మేము కొంత మందిని అలా చేయనిచ్చాం' అని ఆయన తెలిపారు. 'ఇది నానోకు దైవానుగ్రహం కోరే యాత్రే కాకుండా రోడ్డు ప్రయాణం పరీక్ష కూడా' అని జలంధర్, లూధియానాలలోని టాటా అధీకృత విక్రేత దాదా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ రిషి దాదా చెప్పారు. 'నానో ప్రాజెక్టు విజయంవంతం కావడానికి ఖ్వాజా సాహెబ్ ఆశీస్సులు పొందేందుకై కారును అజ్మీర్ కు తీసుకువచ్చారు' అని ఆ ప్రాంతంలోని టాటా మోటార్స్ డీలర్ తెలిపారు.
Pages: -1- 2 News Posted: 23 February, 2009
|