కుమార్తెను దింపుతున్న అర్జున్!
ఇక వీణకు మార్గం సుగమం కావడానికి అర్జున్ శిబిరం గట్టిగా కృషి చేస్తున్నది. వీణ పార్టీ కార్మిక విభాగం ఐఎన్ టియుసిలో ఆఫీస్-బేరర్ అయినప్పటికీ ఆమె పార్టీలో ఎన్నడూ సభ్యురాలు కారు. సాత్నాలో వీణకు పరిస్థితులు గడ్డుగా ఉన్నాయి. 1991లో సాత్నాకు ప్రాతినిధ్యం వహించిన అర్జున్ సింగ్ 1996లో ఘోరంగా ఓడిపోయారు. అప్పటి నుంచి కాంగ్రెస్ ఆ స్థానాన్ని గెలుచుకోలేదు. అసెంబ్లీ ఎన్నికలలో కూడా సాత్నా పరిధిలోకి వచ్చే అన్ని సెగ్మెంట్లలోనూ పార్టీ ఓడిపోయింది.
అందువల్ల ఆ ప్రాంతంలో పలుకుబడి గల బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి) తిరుగుబాటు నాయకుడు ఫూల్ సింగ్ బరీయాను కాంగ్రెస్ చేర్చుకున్నది. అంతేకాకుండా అర్జున్ సింగ్ కు, రాష్ట్ర మాజీ స్పీకర్ శ్రీనివాస్ తివారికి మధ్య ఒప్పందం కుదిరితే వీణకు ప్రయోజనం చేకూరుతుంది. 2004 సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయిన తన కుమారుడు సుందర్ లాల్ కు సాత్నా పొరుగు నియోజకవర్గం రేవా నుంచి టిక్కెట్ సంపాదించడానికి తివారి లాబీ చేస్తున్నారు. రేవాలో సుందర్ లాల్ కు ఠాకూర్ ల వో్ట్లు పడేట్లు అర్జున్ చేయగలిగితే సాత్నాలో వీణకు బ్రాహ్మణుల వోట్లను ఆయన ఆశించవచ్చు.
కాగా, మధ్య ప్రదేశ్ లో తమ బంధువులకు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న బలమైన నాయకులు అర్జున్, తివారి ఇద్దరు మాత్రమే కాదు. విదిశలో తన కుమారుడు ఓమ్ కు పార్టీ టిక్కెట్ కేటాయించాలని హజారిలాల్ రఘువంసి కోరుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో అసలు రఘువంశియే ఓడిపోయారు.
Pages: -1- 2 News Posted: 23 February, 2009
|