పట్టుపురుగులతో పచ్చళ్ళు!
'పట్టుపురుగల ప్యూపేలో మాంసకృత్తులు పుష్కలంగా ఉన్నాయి. మేము కొన్ని తినుబండారాలకు రూపకల్పన చేసి వాటి తయారీ బాధ్యతను చేపట్టవలసిందిగా కాన్డ్ ఫుడ్ వ్యాపారంలో ఉన్న ప్రైవేట్ సంస్థలను సంప్రదించాం. ముడి పదార్థాన్ని ఎగుమతి చేయడం కన్నా ఆహారంగా ప్యూపేను ఎగుమతి చేయడం తేలిక అని మేము భావిస్తున్నాం' అని సమాఖ్య జనరల్ మేనేజర్ వై.పి. సక్సేనా భోపాల్ నుంచి ఫోన్ లో ఒక పత్రిక విలేఖరితో చెప్పారు.
ఇండోర్ లో సమాఖ్య అసిస్టెంట్ మేనేజర్ అలోక్ వర్మ పౌష్టికాహార నిపుణుల సాయంతో భారతీయ, యూరోపియన్ రుచులకు అనువైన ప్యూపే కర్రీ, పికిల్, పిట్జాలను రూపొందించారు. ఆయన ఇంతవరకు విజయవంతంగా మూడు కుకింగ్ ట్రయల్స్ నిర్వహించారు. 'మేము ఈ డిషెస్ ను మాంసాహారులకు వడ్డించాం. వారు వాటిని, ముఖ్యంగా ప్యూపే కర్రీని, ఎంతో మెచ్చుకున్నారు. వాటిని తిన్నవారు అవి రొయ్యలు, పీతల కర్రీల రుచిని పోలి ఉన్నాయని చెప్పారు' అని శాకాహారి అయిన వర్మ తెలియజేశారు.
'ఈశాన్య ప్రాంతంలోని గిరిజనులు పట్టుపురుగుల ప్యూపేను తింటారు. వారు వీటితో ఆహారపదార్థాలను రూపొందించారు. అయితే, ఇతరులకు ఈ ఆహారపదార్థాల గురించి ప్రచారం చేయడం ఒక సవాలే. మధ్య ప్రదేశ్ లోని గిరిజనులు కూడా ప్యూపేను తినేట్లుగా ప్రోత్సహించాలని అనుకుంటున్నాం' అని వర్మ చెప్పారు.
Pages: -1- 2 News Posted: 24 February, 2009
|