లా కాలేజీల్లో ఏజ్ 'బార్'!
అయితే, ఎస్ సి\ఎస్ టి, ఒబిసి విద్యార్థులకు బిసిఐ రాయితీ కల్పించింది. వారు 22 ఏళ్ళ వయస్సులో 12వ తరగతి తరువాత ఐదేళ్ళ కోర్సులోను, 35 ఏళ్ళ వయస్సులో మూడేళ్ళ పిజి కోర్సులోను చేరవచ్చు. న్యాయవాదుల క్వాలిటీ మెరుగుదల కోసమే తాము ఈ వయోపరిమితిని ప్రవేశపెడుతున్నట్లు బిసిఐ స్పష్టం చేసింది. అయితే, ఈ చర్య వల్ల 'వివక్ష' చూపే అవకాశం ఉందని లా కాలేజీలు, అడ్వొకేట్ల వాదన. సమానత్వానికి, తమ ఇష్టానుసారం వృత్తిని చేపట్టేందుకు గల రాజ్యాంగ హక్కును ఇది ఉల్లంఘిస్తున్నదని వారంటున్నారు.
'ఇది అనవసరమైనది. వివక్షతో కూడుకున్నది. ఏ వయస్సులోనైనా చదువుకోకుండా, తన వృత్తిని మార్చుకోకుండా ఎవరినైనా ఎలా నిలువరిస్తారు' అని న్యాయవాది మహేష్ జెఠ్మలానీ అన్నారు. అయితే, 'ఇది మంచి ప్రతిపాదన. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తితో సహా పలువురు సీనియర్ వ్యక్తులు ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారు' అని బెణివాల్ తెలియజేశారు.
Pages: -1- 2 News Posted: 24 February, 2009
|