ఆరు విడతలుగా పోలింగ్?
కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి మధుకర్ గుప్తా, ఆంతరంగిక భద్రతా విభాగం ప్రత్యేక కార్యదర్శి రామన్ శ్రీవాత్సవ మంగళవారం ఉదయం ఎన్నికల కమిషనర్లతో అరగంటకు పైగా చర్చలు జరిపారు. కేంద్రం సమకూర్చే పారా మిలిటరీ సిబ్బంది సంఖ్య గురించి వారు ఇసికి తెలియజేసినట్లు ఆ వర్గాలు చెప్పాయి. 2004 ఎన్నికలలో నియోగించిన 750 కంపెనీలతో పోల్చితే ఈసారి గరిష్ఠంగా 550 కంపెనీల సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉంటారు. ఒక్కొక్క కంపెనీలో 120 మంది సైనికులు ఉంటారు.
ఎన్నికల విధులకు నియోగించే దళాలలో సిఆర్ పిఎఫ్, బిఎస్ఎఫ్ సిబ్బందే ఎక్కువ మంది ఉంటారని ఆ వర్గాలు తెలిపాయి. సరిహద్దు ప్రాంతాలలో అస్సాం రైఫిల్స్, సాయుధ సీమా దళ్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) సిబ్బందిని నియమిస్తారు. అవసరమైతే వారికి అండగా సైన్యాన్ని కూడా నియమిస్తారు.
రాష్ట్రాలకు హోమ్ గార్డులు, రాష్ట్ర రిజర్వ్ పోలీస్ దళం (ఎస్ఆర్ పిఎఫ్)తో సహా సొంత భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించడానికి కేంద్ర సిబ్బందిని నియోగించడం తప్పనిసరి. ఇటీవల జమ్ము కాశ్మీర్ లో ఏడు దశలుగా జరిపిన శాసనసభ ఎన్నికలను ఆ రాష్ట్రంలో అత్యంత విజయవంతంగా నిర్వహించిన ఎన్నికలుగా శ్లాఘించారు.
Pages: -1- 2 News Posted: 25 February, 2009
|