పార్టీ కమిటీకి సోనియా గడువు
గతంలో ఎస్ పి ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్సి సత్యవ్రత్ చతుర్వేది మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 'సమాజ్ వాది మాకు కేవలం 20 సీట్లు, లేదా ఆ లోపు సీట్లను ఇవ్వజూపుతున్నది. మిగిలిన 60 స్థానాలలో మా పార్టీ కార్యాలయాలను మేము మూసివేసుకుని మా కార్యకర్తలను ఇళ్ళలోనే ఉండిపోవలసిందని కోరాలా? కల్యాణ్ సింగ్ తో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని కాంగ్రెస్ చేసేదేమిటి ఉంటుంది? మతతత్వ శక్తులతో ఎన్నడూ సంబంధం పెట్టుకోని ఏకైక పార్టీగా మాకు ఉన్న చరిత్రను మేము నాశనం చేసుకోవాలా?' అని అన్నారు.
సమాజ్ వాది నాయకుల తీరుకు తన ఆక్షేపణలను సోనియా 'ఆమోదించకపోతే' చతుర్వేది మరెంత మాత్రం బాహాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయరని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా, కర్నాటకలో జనతాదళ్ (సెక్యులర్)పై కాంగ్రెస్ కు ఆశలు ఇంకా పోలేదు. తమ పార్టీ సిపిఎం సారథ్యంలోని 'తృతీయ ఫ్రత్యామ్నాయం (ఫ్రంట్)'లో భాగమని జెడి (ఎస్) అధినేత హెచ్.డి. దేవెగౌడ చెప్పినప్పటికీ, దళ్ (ఎస్)తో 'సీరియస్'గానే చర్చలు సాగించవలసిందిగా పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శి గులామ్ నబీ అజాద్ ను పార్టీ అధిష్ఠానం కోరిందని ఆ వర్గాలు తెలిపాయి. అజాద్ ను పార్టీ కర్నాటక వ్యవహారాల ఇన్ చార్జిగా ఇటీవలే నియమించిన విషయం విదితమే.
Pages: -1- 2 News Posted: 25 February, 2009
|