కూటమి కుంటి నడక
కుల సంఘాల బహిరంగ సభల్లో విరివిగా పాల్గొంటున్న ముఖ్యమంత్రి ఆ బహిరంగా సభల్లో కూడా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. శ్రీకాకుళం, విజయనగం, ఉభయ గోదావరి, మహబూబ్ నగర్, అదిలాబాద్, కరీంనగర్, మెదక్, ఖమ్మం, నల్గొండ, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ప్రచారం జరిపి అందరికంటె ముందున్నారు. ప్రజారాజ్యం నాయకులు కూడా ప్రచారంలో చురుగ్గానే ఉన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ చిత్తూరు, కర్నూలు, అనంతపురం, ఖమ్మం, మెదక్ తదితర జిల్లాల్లో ప్రచార యాత్రలు నిర్వహించారు. సామాజిక న్యాయం, బడుగులకు అధికారం నినాదంతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ రోడ్ షోలకు విశేషమైన ఆదరణ లభిస్తుండడంతో మరింత ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఇక మహా కూటమి నాయకులు మాత్రం ముఖ్యమంత్రి కుటుంబాన్నే లక్ష్యంగా పెట్టుకుని, వారిపై అవినీ ఆరోపణలు చేస్తూ, కేంద్ర మంత్రులు, రాష్ట్రపతి, గవర్నర్ తదితర అధికారులకు ఫిర్యాదులు చేయడంలోనే తలముకలై ఉన్నారు.నిరసన కార్యక్రమాలు చేపడుతూ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని అభాసుపాలు చేయాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. కూటమిలో పొత్తులు తేలిన తరువాతే ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని ఆ పార్టీల నాయకులు చెబుతున్నారు. మరో వైపు లోక్ సత్తా పార్టీ తనదైన శైలిలో ప్రచారం సాగిస్తోంది. శాసన సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల జాబితాలు రెండింటిని విడుదల చేసింది. భారతీయ జనతా పార్టీ మాత్రం జాబితాలు తయారు చేసినప్పటికీ, ఇంకా ప్రకటించలేదు.
Pages: -1- 2 News Posted: 26 February, 2009
|