అజార్ ఉభయతారక మంత్రం
తనపై ఉన్న బహిష్కారం రద్దయితే అజార్ కు ఆర్ధికంగా కూడా కలిసివస్తుంది. బహిష్కారం కారణంగా పెన్షన్ తోసహా అన్నిరకాల రిటైర్మెంట్ ప్రయోజనాలు సస్పెండ్ అయిపోయాయి. ఇప్పడు 'బిసిసిఐ బహిష్కారాన్ని రద్దు చేస్తే కొన్ని కోట్ల రూపాయలు ఆయనకు దక్కుతాయి' అని పార్టీ వర్గాలు చెప్పాయి. తనకు విధించిన బహిష్కార శిక్షను సవాలు చేస్తూ నగరంలోని ఒక సివిల్ కోర్టులో అజార్ దావా వేశాడు. అయితే ఈ వివాదాన్ని కోర్టులతో పనిలేకుండా బిసిసిఐతోనే తేల్చుకొమ్మని ఆ కోర్టు ఆదేశించింది. అందుకు అజార్ సిద్ధపడినా బిసిఐ మాత్రం ససేమిరా అంటోంది.
'కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా బిసిసిఐ చైర్మన్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ కు దగ్గరై, బహిష్కార శిక్షను రద్దు చేయించుకోవాల'ని అజార్ ఆశిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ లక్ష్యాన్ని సాధించాలంటే అతడు కాంగ్రెస్ అధిష్టానవర్గానికి చేరువ కావాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అజారుద్దీన్ కాంగ్రెస్ లో చేరడమ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డికి ఇష్టం లేదు. అందువల్లనే తన దరఖాస్తుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించకపోవడంతో అజారుద్దీన్ ఢిల్లీ వెళ్లి పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ను, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి వీరప్ప మొయిలీని మచ్చిక చేసుకున్నాడు. వారి సాయంతో సోనియా గాంధీ ఇంటర్వ్యూ సంపాదించి కాంగ్రెస్ కండువా వేయించుకున్నాడు. ఇప్పడు తన లక్ష్యాన్ని ఎలా సాధిస్తాడన్నది అతడి క్రికెట్ నైపుణ్యం మీద కాకుండా, రాజకీయ చతురత మీద ఆధారపడి ఉంటుంది.
Pages: -1- 2 News Posted: 26 February, 2009
|