కేసీఆర్ ఇదేంటి?
హైదరాబాద్ లో అన్ని పార్టీలు అభ్యర్ధుల ఎంపికలో తలమునకలై ఉండగా, కెసిఆర్ మాత్రం ఢిల్లీలోనే ఉండిపోయారు. సీట్ల పంపకాల్లో తమ టిక్కెట్ అడగవద్దని కెసిఆర్ ను కోరే తెలుగుదేశం నాయకులు అక్కడికే వెళ్లి అయనను కలుసుకుంటున్నారు. అలాగే టి.ఆర్.ఎస్ టిక్కెట్ ఆశిస్తున్న నాయకులు కూడా ఆయన్ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లక తప్పడం లేదు. అంతేకాదు, మహాకూటమిలో చేరినప్పటి నుంచి కెసిఆర్ మీడియాతో కూడా సవివరంగా మాట్లాడకుండా, చెప్పదలచుకున్నదేదో చెప్పేసి వెళ్లిపోతున్నారు. మహాకూటమిలో చేరే విషయం కూడా చివరి వరకూ సస్పెన్స్ లో ఉంచి తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టారు. ప్రజారాజ్యంతో పొత్తుకు చర్చలు జరుపుతూనే, అడిగినన్ని సీట్లు ఇస్తామని తెలుగుదేశం హామీ ఇచ్చాక కూటమిలో చేరడానికి అంగీకరించారు. ఆ తరువాత కూడా కెసిఆర్ ధోరణి అంతుపట్టక కూటమి నాయకులు విస్తుపోతున్నారు.
Pages: -1- 2 News Posted: 26 February, 2009
|