'మర్మం' మార్కెట్ మంత్రం
యునిలివర్ కంపెనీ ఒక కొత్త షాంపూని ఆసియా ప్రాంతంలో విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్న సమయంలో ఒక తుంటరి ఉద్యోగి ఈ షాంపులో ఎక్స్ 9 మూలకం ఉంది అని రాశాడు. దాంతో లక్షలాది షాంపూ బాటిల్స్ ను యూనిలివర్ ఆసియా ప్రాంతాలకు ఎగుమతి చేసింది. ఆ తర్వాత గమనించినప్పటికీ మార్చుకునేందుకు కోట్ల రూపాయల్లో ఖర్చవుతుంది. దాంతో కంపెనీ లేబుల్ ని మార్చే ప్రతిపాదనకు స్వస్తి చెప్పి ఆ షాంపూను ఆసియా మార్కెట్లలో అమ్మివేసింది. అయితే ఈ కొత్త బ్రాండ్ కు విపరీతమైన అమ్మకాలు జరిగాయి.
ఆరునెలలకు తిరిగి మరలా షాంపూ బాటిల్స్ ను పంపే సమయంలో గతంలో జరిగిన పొరపాటును సరిచేసి, ఎక్స్ 9 ఫ్యాక్టర్ అంశాన్ని తొలగించి కంపెనీ ఆసియా మార్కెట్లకు ఎగుమతి చేసింది. అయితే ఈసారి వినియోగదారుల నుండి తీవ్ర విమర్శల్ని యూనిలివర్ కంపెనీ ఎదుర్కొంది. ఎక్స్ 9 ఫ్యాక్టర్ లేని షాంపూ సరిగ్గా లేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో అర్ధం పర్థం లేని టాగ్ ను యునిలివర్ మరలా ఆ షాంపూలపై ముద్రించాల్సిన దుస్థితి ఏర్పడింది. మార్కెటింగ్ కు విజ్ఞానం కంటె ప్రజల సెంటిమెంట్లను పట్టుకోవడం చాలా ముఖ్యమని లిండ్ స్ట్రామ్ తెలిపారు.
అలాంటి టాగ్ లను అంటి పెట్టుకున్న మర్మం (మిస్టరీ) వినియోగదారులను బాగా ఆకర్షిస్తుంది. వినియోగదారుల నుండి అదనంగా వసూలు చేసేందుకు ఇలాంట మార్మికమైన టాగ్ లను మార్కెటింగ్ నిపుణులు తరచు వినియోగిస్తుంటారు. ఉదాహరణకు సోనీ ట్రిన్ ట్రాన్ టివి పేరులో ట్రిన్ ట్రాన్ కు ఎలాంటి అర్ధం లేదు లేదా ఎవరికి తెలియదు. అదో సాంకేతిక మర్మంగా నిలిచింది. ఈ రోజుల్లోని యాడ్స్ సమాచారాన్ని విపరీతంగా కలిగి ఉన్నాయి. అయితే మార్మిక విషయాలకు కూడా అంతే ప్రాధాన్యత నెలకొన్న విషయం గుర్తించుకోవాలి. పెన్నుల తయారీలో పేరెన్నిక గన్న యాడ్ జెల్ కంపెనీ విడుదల చేస్తున్న ఎన్ సి 600, పిజి300, పిజి500, 2కె యంగ్ లాంటి బ్రాండ్లలో సాంకేతిక విశిష్టత ఏమిటో ఎవరికీ తెలియదు. అదే విధంగా కాస్మటిక్ పరిశ్రమ కూడా తన యాడ్స్ లో మార్మికతను ప్రధానంగా వినియోగించుకుంటుంది. కాస్మటిగ్ ఉత్పత్తులు 'డైలీ రీసర్ఫేసింగ్ డే క్రీమ్', యువి ఎస్ పిఎఫ్ 15, పిఏ++, టింటెడ్ మాయిశ్చరైరజర్ యువి లాంటి పలు మార్మిక పదజాలంతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. వినియోగదారులు బ్రాండ్ లకు సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలను ఎప్పటికీ తెలుసుకోలేరు. మార్కెటింగ్ లో 'మర్మం' కూడా ప్రముఖ పాత్ర పోషిస్తోంది.
Pages: -1- 2 News Posted: 27 February, 2009
|