బంగ్లా మ్యూటినీలో ఐఎస్ఐ?
జమాత్ నాయకులు ఎంతగా కలవరపాటుకు గురయ్యారో ఇటీవలి ఒక పరిణామాన్ని బట్టి గ్రహించవచ్చు. ఈ అంశంపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రితో చర్చ జరిపేందుకు పాకిస్తాన్ జియా ఇస్పహాని అనే ఒక ప్రత్యేక దూతను ఢాకాకు పంపింది.
ఆ సమావేశం తరువాత ప్రత్యేక దూత విలేఖరులతో మాట్లాడుతూ, యుద్ధ నేరస్థులను శిక్షించేందుకు ఇది సరైన సమయం కాదని చెప్పారు. 'ఇప్పుడు బంగ్లాదేశ్ కు సాయం చేయాలని పాకిస్తాన్ అనుకుంటున్నది. అందువల్ల వారు తమ తీర్మానం అమలుకు పూనుకోరాదు' అని ఆ దూత సూచించారు.
బంగ్లాదేశ్ అధికారుల అనుమానమే నిజమని తేలేటట్లయితే, బిడిఆర్ ను ఇది కలవరపరిచే పరిణామమే కాగలదు. ఎందుకంటే పూర్వపు అవతారంలో తూర్పు పాకిస్తాన్ రైఫిల్స్ (ఇపిఆర్) గా 1971లో పాకిస్తాన్ పై సాయుధ పోరుకు దిగింది. అప్పటి నుంచి ఏవో స్వల్ప స్థాయి సంఘర్షణలు తప్ప ఈ సరిహద్దు రక్షణ దళం చాలా వరకు భారతదేశ ఆందోళనల విషయంలో సర్దుబాటు ధోరణి కనబరుస్తూన్నది.
అయితే, ఇటీవలి సంవత్సరాలలో ఈ దళంలో కింది స్థాయి సిబ్బందిలో ఛాందసవాద శక్తులు చొరబడి ఉండవచ్చునని ఆ వర్గాలు అభిప్రాయం వెలిబుచ్చాయి.
తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు 'ఒక వర్గం లాలూచీపరులు పన్నిన కుట్రే' ఈ హింసాకాండ అని హసీనా శుక్రవారం ఆరోపించారు. ఈ హత్యాకాండకు పాల్పడిన వారికి క్షమాభిక్ష ప్రసాదించేందుకు ఆమె నిరాకరించారు.
హతులైన కమాండర్ల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఢాకాలోని మీర్పూర్ కంటోన్మెంట్ ను సందర్శించిన అనంతరం హసీనా విలేఖరులతో మాట్లాడుతూ, 'ఒక గ్రూపు ఈ సంఘటనకు పాల్పడినట్లు కనిపిస్తున్నది. మరెవరైనా ఇందుకు పురికొల్పారా అనేది విచారించవలసి ఉంటుంది. విభిన్న ప్రయోజనం కోసం ఈ సంఘటనను ఉపయోగించుకునేందుకు ఏదైనా వ్యూహం పన్నారా అనేది తెలుసుకోవలసి ఉంటుంది.' అని చెప్పారు.
స్థానిక పరిపాలన శాఖ మంత్రి, తిరుగుబాటుదారులతో సంప్రతింపులు జరిపిన కీలక నాయకుడు జహంగీర్ కబీర్ నాయక్ మాట్లాడుతూ, ఈ కుట్రను జయప్రదంగా అమలు పరచడానికి 'మిలియన్ల కొద్దీ టాకాలు' పంపిణీ చేశారని తెలియజేశారు. బిడిఆర్ కేంద్ర కార్యాలయ సముదాయం వెలుపల నిలబడి, 'బిడిఆర్ ముందుకు సాగండి, మీ వెనుక మేము ఉన్నాం' వంటి నినాదాలు చేస్తూ తిరుగుబాటుదారులను ప్రోత్సహించిన జనసమూహం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవలసి ఉందని కూడా ఆయన చెప్పారు.
Pages: -1- 2 News Posted: 28 February, 2009
|