గైర్హాజర్ లో 'వారు' ఘనులు
ఈ జాబితా చాలా విచారం కలిగిస్తున్నది. అందువల్ల ఈ పరిస్థితిని మెరుగుపరుస్తామని కొందరు ఎంపిలు ప్రతిజ్ఞ చేశారు. 'ఎంపిలు పార్లమెంట్ కు హాజరు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు' అని బిజెపి ఎంపి షానవాజ్ హుస్సేన్ చెప్పారు.
ఈ కనీస పాస్ జాబితాలో కొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. సోనియా గాంధి 36 శాతం హాజరు నమోదు చేశారు. హెచ్.డి.దేవెగౌడ పేరున 39 శాతం, ప్రియా సునీల్ దత్ పేరున 46 శాతం, నవజోత్ సింగ్ సిద్ధూ పేరున 45 శాతం, జయప్రద పేరున 43 శాతం హాజరు నమోదైంది.
అయితే, 2004లో లోక్ సభ సభ్యులైన వారిలో ఉత్తములూ లేకపోలేదు. ఎనభై సంవత్సరాల అబ్దుల్ రెహ్మాన్ అంతూలే 95 శాతం హాజరుతో అందరికీ తలమానికంగా నిలిచారు. పవన్ కుమార్ బన్సాల్, కృష్ణ తీర్థ్, సజ్జన్ కుమార్ కూడా అటువంటి ఎంపిల కోవలోకి వస్తారు.
అయితే, హాజరు మాత్రమే పట్టించుకునే విషయం కాదు. సభా చర్చల్లో ఎంత మేరకు పాల్గొన్నారన్నదీ ప్రధానమే. తెలుగుదేశం పార్టీ ఎంపి ఎర్రబెల్లి దయాకరరావు నూటికి నూరు శాతం హాజరును నమోదు చేశారు. కాని ఆయన చర్చ రికార్డును పరిశీలిస్తే ఆ హాజరు నిరర్థకమని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎన్నడూ ఒక్క ప్రశ్నను కూడా అడగలేదు. ఏ చర్చలోనూ పాల్గొనలేదు.
50 శాతం లోపు హాజరు నమోదైన ఎంపిలు దాదాపు 11 శాతం మంది ఉన్నారు. మరి వారిని ఎంత మంది ఇష్టపడుతున్నారనేది చెప్పడం కష్టమే. వారంటే అభిమానంతో వోటర్లు వారిని గుర్తు పెట్టుకుంటారని కూడా చెప్పలేం.
Pages: -1- 2 News Posted: 28 February, 2009
|