యాష్కీకి అజర్ ఎసరు?
అసలే పోలీసు కేసుతో సతమతమవుతున్న మధు యాష్కీకి, ఇప్పుడు అజారుద్దీన్ రంగ ప్రవేశం వల్ల కొత్తగా మరో సమస్య ఎదురైనట్టయింది. ఇదిలా ఉండగా, లోక్ సభకు టిక్కెట్ కోసం అజార్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ చేత ఓకే అనిపించుకున్నాడు.శనివారం రాజశేఖర రెడ్డిని కలిసి, తన మనసులోని భావాలను స్పష్టంగా చెప్పాడు. నిజామాబాద్ స్థానంపై ఆసక్తి లేకపోయినా, తప్పనిసరి అయితే అక్కడినుంచైనా పోటీకి సిద్ధమేనన్నాడు. ఆ తరువాత విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పక్కా రాజకీయవేత్తలాగే ప్రవర్తించాడు. ఎక్కడినుంచి పోటీచేస్తారన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశాడు. 'పార్టీకి, పేదవారికి, అణగారిన వర్గాలకు సేవ చేయడమే లక్ష్యం' అని చెప్పి తప్పించుకున్నాడు. తాను ఎన్నికల్లో పోటీచేయాలని పార్టీ భావిస్తే అభ్యంతరం లేదని, ఎక్కడినుంచి పోటీ చెయ్యాలో పార్టీయే నిర్ణయిస్తుందని చెప్పాడు. అయితే అజారుద్దీన్ కు నిజామాబాద్ సీటు దాదాపు ఖాయమైపోయినట్టే అని అతడి సన్నిహితులు చెబుతున్నారు.
Pages: -1- 2 News Posted: 1 March, 2009
|