40 కోట్ల బల్బులు ఔట్!
'ఈ సంస్థలు సిఎఫ్ఎల్ బల్బులను ఒక్కొక్కటి రూ. 100 ధరకు కొనుగోలు చేస్తాయి. కాని వాటిని రూ. 15 వంతున విక్రయిస్తాయి. తాము సమీకరించిన కార్బన్ క్రెడిట్ ల అమ్మకం హక్కులను కలిగి ఉంటాయి కను ఈ సంస్థలు లాభాలు ఆర్జించగలవు' అని మాథుర్ తెలిపారు. ఈ పథకం 'క్లీన్ డెవలప్ మెంట్ మెకానిజం' (వాతావరణానికి కీడు కలిగించని సాంకేతిక పరిజ్ఞానం)ను ఉపయోగిస్తుంది. వర్ధమాన దేశాలలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే విధంగా పెట్టుబడి పెట్టేందుకు సంపన్న దేశాలకు ఈ సిస్టమ్ వీలు కలిగిస్తుంది.
దీని వల్ల భారతదేశంలో విద్యుదుత్పాదక సంస్థలు తక్కువ రేటుకు సిఎఫ్ఎల్ బల్బును విక్రయించి, యూరోపియన్ దేశాలకు కార్బన్ క్రెడిట్ లను విక్రయించడం ద్వారా మిగిలిన సొమ్మును రాబట్టుకోవడానికి వీలు కలుగుతుంది. 'సమస్త ప్రపచం భారతదేశం పంథాను అనుసరిస్తే తత్ప్రభావం బొగ్గు ఆధారంగా పని చేసే సుమారు 220 విద్యుత్ కేంద్రాల మూసివేయడంతో సమానం కాగలదు' అని భారతదేశానికి గ్రీన్ పీస్ రాజకీయ, వాణిజ్య వ్యవహారాల సలహాదారు శ్రీనివాస్ కృష్ణస్వామి సూచించారు.
Pages: -1- 2 News Posted: 1 March, 2009
|