వరల్డ్ కప్ కూ 'టెర్రర్'
వరల్డ్ కప్ టోర్నమెంట్ కు వ్యవధి ఇక 23 నెలలే వుంది. నిర్ణయాన్ని సుమారు వారం రోజుల్లోగా తీసుకుంటామని ఐసిసి ఉపాధ్యక్షుడు, నిర్వాహక కమిటీ చైర్మన్ అయిన శరద్ పవార్ సూచనప్రాయంగా చెప్పారు. సిఇఓ హరూన్ లోర్గాట్ తో ప్రస్తుత పరిస్థితిపై చర్చించానని, వచ్చే వారంలో ఏదో ఒక రోజు సమావేశమవాలని నిర్ణయించామని, వరల్డ్ కప్ తో సంబంధం వున్న సభ్య దేశాలన్నీ కలసి ఏ నిర్ణయమైనా తీసుకోవాలని ఆయన తెలిపారు. పాకిస్తాన్ లో మ్యాచ్ లు నిర్వహించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. నాలుగేళ్లకోసారి వచ్చే ఈ టోర్నమెంట్ ను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లకు అప్పగించడం ఒక ప్రత్యామ్నాయం. ఈ రెండు దేశాలు ఇప్పటికే రాబోయే వరల్డ్ కప్ నిర్వాహక దేశాల రిజర్వ్ జాబితాలో ఉన్నాయి. మన బోర్డే సొంతంగా నిర్వహించే బాధ్యతలు స్వీకరించడానికి ముందుకు వచ్చే అవకాశం లేదని, ఎందుకంటే నాలుగు దేశాలకు నిర్వహణ బాధ్యత కేటాయించినందు వల్ల మనం ఒంటరిగా నిర్వహించగలమో లేదో ఊహించి చెప్పలేమని, తుది నిర్ణయం తీసుకోవలసింది ఐసిసియే నని బిసిసిఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
Pages: -1- 2 News Posted: 4 March, 2009
|