బిజెపిలో మరో 'వార్'రూమ్!
తనను కేంద్ర ఎన్నికల నిర్వహణ కమిటీ అధిపతిగా నియమించాలని అరుణ్ జైట్లీ కోరారు. కాని కేంద్ర యంత్రాంగాన్ని రద్దు చేసినందున ఇది సాధ్యం కాదు. పార్టీ ఆకాంక్షలకు భిన్నంగా ఎన్నికలలో పోటీ చేయరాదని జైట్లీ నిర్ణయించుకున్న తరువాత ఆయనకు ప్రాముఖ్యం ఇవ్వడాన్ని ఇతర సీనియర్ నాయకులు కూడా వ్యతిరేకించారు. అందువల్ల జైట్లీకి అద్వానీ ఏ బాధ్యతనూ లాంఛనంగా అప్పగించలేదు. కాని మీడియా, ప్రచారం, ఆర్థిక వనరులు అనే మూడు కీలక విభాగాల బాధ్యతలను జైట్లీకి అప్పగించారు.
ఇతర సీనియర్ నాయకులు కుందుతున్నట్లుగానే, జైట్లీ కీలక వ్యూహకర్తగా ఆవిర్భవించారు. ప్రచార వ్యూహం ఖరారుకు, నినాదాల ఎంపికకు, మీడియా కోసం ప్రకటనల ప్రణాళికల రూపకల్పనకు, ఆర్థిక వనరుల నిర్వహణకు ఆయన బాధ్యత వహిస్తారు. బిజెపి నాయక శ్రేణిలో ఇది తీవ్ర నిరసనలకు దారి తీసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్నికల ఆఫీసును ఏర్పాటు చేయాలని వారు కోరారు. దీనితో పార్టీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ ఈ పరిస్థితిని సర్దుబాటు చేయడానికి ఉపక్రమించారు. జైట్లీ ఏకైక ఎన్నికల ఇన్-చార్జి కారనే సందేశాన్ని రాజనాథ్ పంపారు.
రెండవ 'వార్ రూమ్' ఏర్పాటు కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ఇతరులు తీసుకున్న నిర్ణయాలను ఇది అమలు పరుస్తుందని తెలియజేశారు. అంటే మొదటి వార్ రూమ్, జైట్లీ ఇప్పటికీ వ్యూహరచన చేయనుండగా, కొత్త కేంద్రం ఇతర వ్యూహానికి సంబంధించి ఇతర కీలక బాధ్యతలను నిర్వహించగలదని దీని వల్ల విదితమవుతున్నది. సమన్వయం, పర్యటన ప్రణాళికలు, ఫీడ్ బ్యాక్, రాష్ట్ర స్థాయి ఖర్చుల పర్యవేక్షణ, ఎన్నికల కమిషన్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు వంటి బాధ్యతలను ఈ కొత్త కార్యాలయం నిర్వహిస్తుందని వెంకయ్య నాయుడు తెలియజేశారు.
Pages: -1- 2 News Posted: 5 March, 2009
|