70వేలకు నానో బికింగ్
అహ్మదాబాద్ సనంద్ వద్ద నానో ఫ్యాక్టరీ నిర్మాణానికి ఒక ఏడాది కాలం పడుతుంది. ఈ ఫ్యాక్టరీలో ఏడాదికి 5 లక్షల కార్లను ఉత్ప్తత్తి చేసే అవకాశముంది. అప్పటిదాకా ఉత్తరాఖండ్ పంత్ నగర్, పుణె ప్లాంట్లలో నానో కార్ల ఉత్పత్తి జరుగుతుంది. అయితే ఈ విషయాలపై టాటామోటార్స్ ఇప్పటిదాకా అధికార ప్రకటన చేయలేదు. అంతే కాకుండా బ్యాంకర్లు వెల్లడించిన విషయాలపై ఎలాంటి స్పందన లేదు. నానో హై ఎండ్ వర్షన్స్ పై కంపెనీ ఎక్కువగా సబ్సిడీలను అందిస్తుంది. నానో బేసిక్ పై సబ్సిడీల్లో కేవలం 15 శాతం మాత్రమే కంపెనీ అందించనున్నట్లు బ్యాంకర్లు తెలిపారు.
నానో కార్లకు ఫైనాన్స్ అందించే విధి విధానాల రూపకల్పనపై పలు బ్యాంకులు కుస్తీ పడుతన్నాయి. కొన్ని బ్యాంకులు డిమాండ్ డ్రాప్ట్ ను గాని, పే ఆర్డర్ ను గాని నానో కొనుగోలు దారులకు అందిస్తుంది. అయితే చిన్న మొత్తంలో మార్జిన్ మనీని గాని, కొంత అడ్వాన్స్ ను గాని కస్టమర్లు చెల్లించవలసి వస్తుంది. డెలివరి వైఫల్యమైన సందర్భంలో కంపెనీ వద్ద సొమ్మును తిరిగి బ్యాంకు చెల్లించవలసి ఉంటుంది. ఆ సొమ్ముపై వడ్డీ కూడా బ్యాంకుకు చెల్లించవలసి వస్తుందని కొంత మంది బ్యాంకర్లు తెలిపారు. నానో రుణం సాధారణ వాహన రుణం లాంటిది కాదు. సాధారణ వాహన రుణాల్లో వాహనమే సెక్యూరిటీగా ఉంటుంది. నానో విషయంలో అలా కాదు.
నానో రుణం సాధారణ వాహన రుణం లాంటిది కాక, కేవలం అడ్వాన్స్ మాత్రమే. అందువల్ల బుకింగ్ మొత్తం చాలా అధికంగా నిర్ణయించడం జరిగింది. కారు వినియోగదారుని చేతికి రావడానికి చాలా ముందుగా చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల నానో బికింగ్ కోసం ఇస్తున్న రుణాలను వ్యక్తిగత రుణాలుగా బ్యాంకులు పరిగణించి, వాహన రుణాలపై వేసే వడ్డీ కంటే కొద్దిగా అధికంగా వడ్డీ రేటు నిర్ణయిస్తున్నారు. నానో కారు వినియోగదారుని చేతికి వచ్చిన సందర్భంలో బుకింగ్ కోసం అందజేసిన రుణాన్ని కూడా వాహన రుణంగా బ్యాంకులు మార్చాలని నిర్ణయించుకున్నాయి. మరో బ్యాంకు నానో బుకింగ్ కు ఇచ్చే రుణాన్ని అడ్వాన్స్ గా పరిగణిస్తోంది. ఇప్పటికే వాహన రుణాలను పొందిన వినియోగదారులకు నానో రుణాన్ని అందించకూడదని మరో బ్యాంకు నిర్ణయించుకుంది.
Pages: -1- 2 News Posted: 5 March, 2009
|