సిరీస్ విజయం లక్ష్యం
మూడో బంతి వేసేటప్పుడు ప్రత్యేకించి మనసులో ఏమీ అనుకోలేదని, హ్యాట్రిక్ సాధించే బంతి కాబట్టి మంచి బంతే వేసినా అతడు(మిల్స్) తప్పించుకోగలిగాడని హర్భజన్ చెప్పాడు. సీమ్ బౌలర్లకు పూర్తిగా సహకరించే పిచ్ లు గల న్యూజిలాండ్ లాంటి దేశాల ప్రయటనకు వెళ్లేటప్పుడు స్పిన్నర్ల మనోభావాలు ఎలా ఉంటాయన్న ప్రశ్నకు, 'అంతా తెలివిగా ఆలోచించి బంతులు వేయడంలో ఉంటుంది. విభిన్న వికెట్లమీద, విభిన్న వాతావరణ పరిస్థితుల్లో బౌలర్ల ప్రాధాన్యాలు కూడా మారుతుంటాయి. పిచ్, వాతావరణాలతో పాటు ప్రత్యర్ధి బ్యాట్స్ మన్ ఆటతీరుకు తగ్గ బంతులు నేర్పుగా వేయగలవాడే కెప్టెన్ కు కలిసివచ్చే బౌలర్' అని జవాబిచ్చాడు. 'స్పిన్నింగ్ వికెట్ల మీద ఆడేటప్పుడు మొత్తం వికెట్లు పడగొట్టి, జట్టుకు విజయం చేకూర్చడం నా బాధ్యత' అన్నాడు నవ్వుతూ. మంగళవారం నాటి విజయం తరువాత సిరీస్ కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా ఆశిస్తోందని, 'అదే నా లక్ష్యం. అదే జట్టు లక్ష్యం' అని చెప్పాడు.
Pages: -1- 2 News Posted: 5 March, 2009
|