అటల్జీ అప్పీలు అద్వానీకేదీ?
క్రితంసారి సాధారణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రచార నిర్వాహకులలో జైరామ్ రమేశ్ ఒకరు. '2004లో మేం పిల్ల కాకులం. బయటివారు మమ్మల్ని పూచిక పుల్లల్లా తీసి పారేసేవారు. మా వాళ్లే మమ్మల్ని అపశకునపక్షులన్నారు. ఒక్క కాంగ్రెస్ అధ్యక్షురాలు తప్ప మిగిలినవారందరూ మా శక్తి యక్తులను సంశయించిన వారే. ఎన్ని ఒడిదడుకులు ఎదురైనా పార్టీని ముందుండి నడిపించిన ధీరురాలు ఆమె. ఒంటి చేత్తో పార్టీ పతాకాన్ని ఆమె రెప రెపలాడించారు' అని ఆయన ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.
2004లో భారతీయ జనతా పార్టీ కూడా ఆర్ధిక వ్యవహారాల నిర్వహణకు సంబంధించి, మంచి పోరాట పటిమ గల శక్తిగా ఉండేది. ఆ పార్టీ యువ నాయకుడు ప్రమోద్ మహాజన్ వనరులను సమకూర్చడంలో నేర్పరి. యువశక్తిని కూడగట్టడంలో దిట్ట. '2009లో పార్టీ అభ్యర్ధులకు ప్రతికూలత ఎదురవుతున్నా మేమే పటిష్టంగా ఉన్నాం. ప్రచారంలో పాల్గొంటే 5 నుంచి 7 శాతం ఓట్లు అదనంగా రాబట్టగల వాజ్ పేయి ఇప్పుడు పార్టీ కార్యకలాపాలకు దూరమైపోయారు. అద్వానీ విభజించి పాలించడంలో చతురుడే కాని వాజే పేయికి ఉన్న ఆకర్షణ ఆయనకు లేదు' అని జైరామ్ రమేశ్ వ్యాఖ్యానించారు.
Pages: -1- 2 News Posted: 5 March, 2009
|