కసబ్ కోసం 2కోట్లతో టన్నెల్!
ఇది తరువాత ఉగ్రవాద కేసులపై విచారణ జరిపేందుకు శాశ్వత న్యాయస్థానం కావచ్చు. ఆర్థర్ రోడ్ జైలు గోడల ఎత్తు 25, 30 అడుగుల మధ్య ఉన్నది.
ఇప్పుడు చేస్తున్నట్లుగా సొరంగ మార్గంలో కాకుండా తన సెల్ నుంచి ప్రత్యేక కోర్టు వరకు కసబ్ నడచి వెళ్ళేటట్లయితే గోడ మీదుగా ఎవరైనా జరిపే గ్రెనేడ్ దాడికి అతను గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు భావించారు. కాగా, పాకిస్తాన్ పౌరుడైన కసబ్ తన తరఫున వాదన కోసం న్యాయవాది సాయాన్ని కల్పించవలసిందని కోరుతూ పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి ఇదివరకే ఒక లేఖ రాశాడు. ఏ న్యాయవాదినైనా నియోగించుకోదలిచారా అని సోమవారం అతనిని మేజిస్ట్రేట్ అడగవచ్చు.
ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ అభిప్రాయం ప్రకారం, అతనికి మూడు అవకాశాలు ఉన్నాయి. ఒకటి - అతని కోసం పాకిస్తాన్ ప్రభుత్వం ఒక న్యాయవాదిని ఎంపిక చేయవచ్చు. రెండవది - కసబ్ స్వయంగా న్యాయవాదిని ఎంచుకోవచ్చు. మూడవది రాష్ట్ర న్యాయ సహాయ విభాగం నుంచి ఒక న్యాయవాదిని కసబ్ కోసం కోర్టు సమకూర్చవచ్చు. ఈ కేసు విచారణ ఆరు నెలల పాటు సాగవచ్చు. ఈ సమయంలో కసబ్ ను అత్యున్నత స్థాయి భద్రత ఏర్పాట్లు గల ఆర్థర్ రోడ్ జైలులోనే నిర్బంధిస్తారు. అతను అదే జైలులో ఏర్పాటయ్యే ప్రత్యేక కోర్టుకు హాజరవుతాడు. పోలీసులు ఇప్పటికే ఒక మేజిస్ట్రేట్ కోర్టులో ఒక చార్జిషీటు దాఖలు చేశారు. నవంబర్ 26న కసబ్ ను అరెస్టు చేసినప్పటి నుంచి ఆ కోర్టు ఎప్పటికప్పుడు అతనిని రిమాండ్ కు పంపుతూనే ఉన్నది.
Pages: -1- 2 News Posted: 6 March, 2009
|