`గాలి' ప్రచారం
ఈనెల 12 నుంచి జూనియర్ ఎన్టీఆర్ శ్రీకాకుళం జిల్లా నుంచి హెలికాప్టర్ సుడిగాలి పర్యటన మొదలవుతుంది. ఇతని పర్యటన మొత్తం జాతీయ రహదారి వెంటే సాగుతుంది. బహిరంగసభలలో మాట్లాడి వెంటనే అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోతారు. రోడ్ షో లాంటి కార్యక్రమాలను జూనియర్ ఎన్టీఆర్ తో తాము తట్టుకోలేమని, జనాన్ని అదుపుచేయడం, రోడ్ షో ఖర్చులు భరించడం తమవల్ల కాదని జిల్లాల నాయకులు చేతులెత్తేయడంతో చంద్రబాబు ఈ హెలికాప్టర్ యాత్రను జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా రూపొందించారని తెలిసింది. ఇంకా తెలుగుదేశం తరపున రోజా, తారకరత్న, బాబూమోహన్, మురళీమోహన్ లాంటి నటులు వివిధ రంగాలలో ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
ఒకే వేదికపై ఆ ముగ్గురూ!
ఇంత కాలం చెరో వైపు నుంచి ప్రచారం సాగిస్తూ 2009 ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించేసిన ప్రజారాజ్యం సోదర త్రయం అతి త్వరలోనే ఒకే వేదికపై దర్శనం ఇవ్వనున్నారు. మిగిలిన జిల్లాల్లో రోడ్ షో లను చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు ముగించుకున్న తరువాత అసలైన ఎన్నికల ప్రచార హంగామాకు తెర తీయడానికి సిద్ధ పడుతున్నారు. ప్రతీ జిల్లాలోనూ ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని, మొదటి విడత, రెండో విడత పోలింగ్ లను దృష్టిలో పెట్టుకుని ఈ సభలను నిర్వహించాలని ప్రజారాజ్యం పార్టీ వ్యూహకర్తలు నిర్ణయించారు.ఈ సభా వేదకపై ఒక్క చిరంజీవే కాకుండా నాగబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఉంటారని చెబుతున్నారు. అభ్యర్ధుల తరపున నియోజక వర్గాల వారీ ప్రచారంలో కూడా ఈ ముగ్గురూ కీలక పాత్ర పోషించాలని నిర్ణయించారు. మొత్తం ప్రచార పర్యటనలకు హెలికాప్టర్లను వినియోగించనున్నారు.
ఇక యువతరం హృదయాలను కొల్లగోట్టే అందాల నటి త్రిష కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గోనడానికి సుముఖత వ్యక్తం చేసింది. ఈమెతో పాటు మరికొంత మంది నటులను,హస్యనటులను ప్రచారంలో కి దించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే జీవిత రాజశేఖర్ దంపతులు కాంగ్రెస్ తరపున ప్రత్యక్ష ప్రచారం చేపట్టారు. ఘట్టమనేని కృష్ణ, అక్కినేని నాగార్జున కాంగ్రెస ప్రచారంలో తెరవెనుక సహకారం అందిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 6 March, 2009
|