రెండో వన్డే వర్షార్పణం
ఆ తరువాత టెండుల్కర్, యువరాజ్ సింగ్ ఆరు బంతుల వ్యత్యాసంలో ఔటయ్యారు. తన 424వ వన్డేలో 91వ అర్ధ సెంచరీ(7 బౌండరీలు, ఒక సిక్సర్) సాధించిన సచిన్ కివీస్ కెప్టెన్ వెట్టోరి బంతిని స్వీప్ చేయబోయి ఔటయ్యాడు. యువరాజం సింగ్ నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కొని కాల్ మిల్స్ బౌలింగులో స్లిప్ ఫీల్డర్ రాస్ టేలర్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తరువాత గెభీర్, కెప్టెన్ ధోని స్కోర్ రేటును పెంచడానికి ప్రయత్నిస్తుండగా మళ్లీ వర్షం ప్రారంభమయింది. ఆట రద్దయ్యే సమయానికి ధోని 23, సురేష్ రైనా 13 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. ఆట ప్రారంభానికి ముందు రెండు జట్ల ఆటగాళ్లు, అంపైర్లు, అధికారులు, ప్రేక్షకులు పాకిస్తాన్ లో శ్రీలంక జట్టుపై జరిగిన దాడికి సంతాప సూచకంగా ఒక నిముషం మౌనం పాటించారు.
Pages: -1- 2 News Posted: 6 March, 2009
|