సిపిఐకి 'అగ్ని పరీక్ష'
అప్పటికి పశ్చిమ బెంగాల్, కేరళ, మణిపూర్, జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాల్లో సిపిఐ రాష్ట్రస్థాయి పార్టీగా గుర్తింపు కలిగి ఉంది. కేరళ, మణిపూర్ లలో అసెంబ్లీలో స్థానాల ప్రాతిపదికగా, మిగతా మూడి రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాల ప్రాతిపదికగా ఆ గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో కేరళలోని పొన్నాని స్థానంలో ఈ సారి పోటీకి సిపిఐ పడుతున్న ఆరాటాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ లభించే ఓట్లు జాతీయపార్టీ హోదాను నిలబెట్టుకోడానికి ఉపయోగ పడతాయి. అయితే సిపిఐ మాదిరిగా సిపిఎంకు మనుగడ సంక్షోభం భయం లేదు. అందువల్ల రాష్ట్రంలోని ఛాందసవాద ముస్లింల ఓట్లు సంపాదించుకునే దిశగా పావులు కదుపుతున్న ఆ పార్టీ అబ్దుల్ నాసర్ మదాని అనే ఇస్లామిస్టు నాయకుడిని అభ్యర్ధిగా బరిలోకి దించింది.
సిపిఐ లాగే సిపిఎంకూ గతంలో ఇలాంటి అగ్ని పరీక్షే ఎదురయింది. 2001లో 33 మంది లోక్ సభ ఎంపిలను కలిగి ఉన్నప్పటికీ, కనీసం నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్రస్థాయి పార్టీ హోదా కలిగి ఉండాలన్న నిబంధన కారణంగా జాతీయస్థాయి పార్టీ హోదాను కోల్పోయింది. ఆ తరువాత, ఏ పార్టీకైనా లోక్ సభ స్థానాలను బట్టి జాతీయస్థాయి పార్టీ హోదా కల్పిస్తామన్న కొత్త షరతును ఎన్నికల కమిషన్ అమలులోకి తెచ్చింది.
Pages: -1- 2 News Posted: 7 March, 2009
|