36 కోట్ల 'మొబైల్' ఓటర్లు!
ఉత్తర ప్రదేశ్ లో ముజఫర్ నగర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో తమ టివి సెట్ల ద్వారా గ్రామస్థులు రోడ్డు నిర్మాణం కోసం తమ స్థలాన్ని ప్రభుత్వం తేలికగా స్వాధీనపరచుకోజాలదనే విషయాన్ని తెలుసుకున్నారు. ఒక హైవే కోసం ప్రభుత్వం 900 ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేయడానికి వ్యతిరేకంగా తాము దాఖలు చేసిన అప్పీలును స్థానిక కోర్టు ఒకటి తిరస్కరించినప్పుడు వారు జైళ్ళ ఇన్ స్పెక్టర్ జనరల్ కిరణ్ బేడిని ఫోన్ ద్వారా సంప్రదించారు. వారు తమ ఇబ్బంది గురించి ప్రత్యేక, గ్రామీణ రేడియో షోలో చర్చించి, అప్పీలు ఎలా దాఖలు చేసి నష్టపరిహారం కోరవచ్చునో తెలుసుకున్నారు.
ప్రచారానికి సెల్ ఫోన్ల కన్నా మెరుగైన సాధనంగా ఎఫ్ఎం రేడియో బాగా ఉపకరించగలదని, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో అమలులో ఉన్న విధానమని, మారుమూల ప్రాంతాలకు కూడా ఈ సమాచారం చేరుతుందని బ్రాండ్ కన్సల్టెంట్ సంతోష్ సూద్ చెప్పారు. 'పట్టణ ప్రాంతాలలో సెల్ ఫోన్లు వంటి కొత్త టెక్నాలజీ వోటర్లను ఆకట్టుకోవడానికి అత్యంత సమర్థమైన సాధనంగా రుజువైంది. అటువంటి ప్రచారం గ్రామీణ ప్రాంతాలలో కొంత వరకు కష్టంతో కూడుకున్నదే. ఎందుకంటే గ్రామీణ ప్రజలు కొత్త మాధ్యమానికి ఎలా స్పందిస్తారనేది చెప్పలేం' అని ఆయన అన్నారు.
'ఆశయాకాంక్షలు కూడా భిన్నంగా ఉంటాయి' అని భారీ వాణిజ్య ప్రకటనల సంస్థ 'ఒగిల్వీ ఇండియా' ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పీయూష్ పాండే పేర్కొన్నారు. 'సెల్ ఫోన్లు, ఎఫ్ఎం రేడియో వంటి మార్గాలను ఉపయోగించుకునేటప్పుడు రాజకీయ పార్టీలు వినూత్నపంథాలో, సృజనాత్మకంగా వ్యవహరించవలసి ఉంటుంది' అని పాండే హెచ్చరించారు.
Pages: -1- 2 News Posted: 7 March, 2009
|