గీతారెడ్డికి టిక్కెట్ లేనట్టే!
తెలంగాణ నియోజకవర్గాల్లో వరంగల్ జిల్లాలో కొండా సురేఖ, హరి రమాదేవి, నల్గొండ జిల్లాలో స్రవంతి రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో స్వర్ణ సుధాకర్, కరీంనగర్ జిల్లాలో నేరెళ్ల శారద, మెదక్ జిల్లాలో సునీతా లక్ష్మా రెడ్డి, రంగారెడ్డి జిల్లాలో సబితా ఇంద్రారెడ్డి లకు టిక్కెట్లు లభించనున్నాయి. హైదరాబాద్ పరిధిలో సికిందరాబాద్ నియోజకవర్గం టిక్కెట్ సినీ నటి జయసుధకు దాదాపు ఖాయమంని చెబుతున్నందున శారదకు మల్కాజ్ గిరి దక్కవచ్చని భావిస్తున్నారు. సల్కాజ్ గిరి టిక్కెట్ కోసం రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుమతీ మోహన్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం టిక్కెట్ ఇటీవలి ఉప ఎన్నికలో పెలుపొందిన మణెమ్మకే మల్లీ టిక్కెట్ ఇవ్వాలా లేక కొత్తవారికి అవకాశం ఇవ్వాలా అన్న విషయమై తర్జన భర్జనలు జరుగుతున్నాయి
Pages: -1- 2 News Posted: 9 March, 2009
|