సచిన్ సూపర్బ్ : ధోని
ఆదివారం వన్డే ఆడిన మైదానం విలక్షణంగా ఉందని, దాని కొలతలను దృష్టిలో పెట్టుకుని షాట్లు కొట్టవలసి వచ్చిందని గత 19 సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్ పోటీలలో ఆడుతున్న టెండుల్కర్ చెప్పాడు. న్యూజిలాండ్ లో ఎక్కువ వన్డేలు ఆడకపోయినప్పటికీ, ఇక్కడ సెంచరీ కొట్టాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానన్నాడు. '1994లో నేను న్యూజిలాండ్ లో భారత జట్టు ఓపెనర్ అవతారం ఎత్తినప్పుడు, మొదటి మ్యాచ్ లో 84 పరుగులు చేశాను. బహుశా ఇంతవరకూ సెంచరీకి దగ్గర వరకూ ఉన్న స్కోరు అదేనేమో! క్రితంసారి వచ్చినప్పుడు కాలు బెణకడం వల్ల ఎక్కువ వన్డేలు ఆడలేకపోయాను. వెల్లింగ్టన్ లో సెంచరీ వైపు దూసుకుపోతున్నా, వర్షం కారణంగా ఆ ఊపు తగ్గిపోయింది. కాని ఇక్కడ అదృష్టవశాత్తు అలాంటిదేమీ లేకుండా సాఫీగా జరిగిపోయింది. అందువల్ల కొన్ని మంచి షాట్లు కొట్టగలిగాను' అని సచిన్ వివరించాడు.
Pages: -1- 2 News Posted: 9 March, 2009
|