ఆల్ ఫ్రీ ! నో మనీ !!
ప్రధాన ప్రతిపక్షం నాయకుడు చంద్రబాబు నాయుడు తాను గతంలో అధికారంలో ఉన్న తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కంటే ముఖ్య కార్యనిర్వాహణా అధికారి(సిఇవో)గానే తనను తాను అభివర్ణించుకునే వారు. అప్పటి ఆయన కార్యక్రమాలు కూడా ఆ పద్ధతిలోనే నడిచాయి. ఐదేళ్ళ తరువాత మళ్ళీ ఎన్నికల వేళ ఆయన విడుదల చేసిన ఎన్నికల ముసాయిదా ప్రణాళికలో కూడా తాను సిఇవో పాత్రను పోషించడానికే ఇష్టపడుతున్నట్టు సూచించారు. ఆయన ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా ఉండే ధార్మిక సంస్థ ఏదంటే అది రాష్ట్ర `ప్రభుత్వం'.
రాష్ట్రంలోని ప్రతీ పేదవాని ఇంటికీ కలర్ టివి ఉచితంగా ఇస్తామన్న చంద్రబాబు ఈ హామీని తమిళనాడు కరుణానిధి ప్రణాళిక నుంచి కాపీ కొట్టారు. తాను అధికారంలోకి వస్తే ఇళ్ళుకు తాను ఉచితంగా కరెంటు ఇస్తానని, కేబుల్ ఆపరేటర్లకు పన్నులు మినహాయింపు ద్వారా ఉచిత కలర్ టివిలకు కనెక్షన్ కూడా ఉచితంగా లభిస్తుందని పేర్కొన్నారు. దక్షిణ భారత దేశంలోని అతి పెద్ద రాష్ట్రంలో పేదలంతా కష్టపడకుండా పైసా ఖర్చు పెట్టక్కర్లేకుండా వినోదాన్ని ఉచితంగా పొందవచ్చు.
ఈ నాయకులు ఇచ్చిన హామీలను చూసి దేశ ఆర్ధక నిపుణులు కంగారు పడుతున్నారు. పన్నుల ద్వారా ప్రజలు సమకూర్చిన ధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఈ పథకాలు ఉన్నాయని జాతీయ ప్రజా ఆర్ధిక, విధాన మండలి డైరెక్టర్, ప్రధానమంత్రి ఆర్ధిక సలహ మండలి సభ్యుడు ఎం.గోవిందరావు అభిప్రాయపడ్డారు. దేశ ఆర్దిక వ్యవస్థ కునారిల్లిపోవడం ఖాయమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ హామీలు కావడంతో ప్రస్తుత హోం మంత్రి, మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం కొంచెం ఆచితూచి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంతులేని సొమ్ము ఉంటే ఈ పథకాలను అమలు చేయెచ్చన్నారు. కాకపోతే లక్ష కోట్ల రూపాయల మన రాష్ట్ర వార్షిక బడ్జెట్లో వ్రతీ పేద వానికి నెలకు రెండువేల రూపాయల స్కీం కే 36 వేల కోట్లు, ఉద్యోగుల జీతభత్యాలకు యాభై వేల కోట్ల రూపాయలు పోతే ఇతర సంక్షేమ పథకాలను మిగిలిన సొమ్ముతో చంద్రబాబు సరిపెడతారా అని మన ముఖ్యమంత్రి వైఎస్ ప్రశ్నిస్తున్నారు..కాంగ్రెస్ ఇంకా ఎన్నికల ప్రణాళికను బయట పెట్టనప్పటికీ అది కూడా రాష్ట్రాన్ని ధర్మసత్రంగా మార్చే పథకాలను ప్రకటించడంలో వెనుకబడి ఉంటుందని ఎవరూ అనుకోవడం లేదు.
Pages: -1- 2 News Posted: 9 March, 2009
|