పీఆర్పీ ప్రత్యేకత ఏంటి?
పన్ను రాయితీల రూపంలో తమకు ప్రోత్సాహకాలు కల్పించడంపైన, తమ క్లినిక్ లు, ఆసుపత్రుల విద్యుత్ కనెక్షన్లను కమర్షియల్ స్థాయి నుంచి డొమెస్టిక్ స్థాయికి మార్చడం గురించి పార్టీ దృష్టి కేంద్రీకరించాలని డాక్టర్లు సూచించారు. ముసాయిదా మేనిఫెస్టోపై బిసి నాయకుడు ఒకరు మాట్లాడుతూ, తమ ఆత్మగౌరవం విషయాన్ని మేనిఫెస్టోలో ప్రస్తావించి ఉంటే బాగుండేదని అన్నారు. శాలివాహన కులస్థులు గ్రామ దేవతల ఆలయాలలో పూజారులుగా వ్యవహరిస్తుంటారని, వారికి ఆలయ కమిటీలలో సభ్యత్వం కల్పిస్తే వారికి కొంత వరకు గౌరవప్రదంగా ఉంటుందని ఆ బిసి నాయకుడు పేర్కొన్నారు.
అంగన్ వాడి కార్యకర్తలు, అసంఘటిత రంగాలలోని కార్మికులు, కొత్తగా రూపుదిద్దుకుంటున్న టివి పరిశ్రమలోని కార్మికుల సమస్యలను మేనిపెస్టోలో పరిగణనలోకి తీసుకోలేదని కొందరు నాయకులు చెప్పారు. ఎన్నికల ప్రణాళిక పూర్తి స్థాయిలో వెలువడినప్పుడు అన్ని అంశాలతో నిర్దుష్టంగా ఉండాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 11 March, 2009
|