'రాజ్యం'లో పెరిగిన ధీమా
గోదావరి జిల్లాల్లో ఇప్పటికే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు భారీగా ప్రచారం సాగిస్తున్నాయి. పిఆర్పీకి పట్టున్న జిల్లాలపై ఆధిపత్యం కోసం పెండు పార్టీలు ప్యత్నిస్తున్నాయి. అయినప్పటికీ మెగాస్టార్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టడం అసాధారణ విషయంగా పరిగణిస్తున్నారు. ఈ స్ఫూర్తి ఇకపై ఇలాగే కొనసాగుతుందని యువరాజ్యం ధీమా వ్యక్తం చేస్తోంది. ఎన్నికలకు సంబంధించి ఇంకా అభ్యర్ధులను ప్రకటించక పోవడంతో టిక్కెట్లు ఆశిస్తున్న వారంతా తమ సత్తా చూపించాలని ఉత్సాహపడుతున్నారు. జిల్లా స్థాయిలే జరిగే బహిరంగ సభలకు భారీగా జనసమీకరణ చేసేందుకు ఉరకలు వేస్తున్నారు.
ఏయే జిల్లాల్లో ఎప్పడు బహిరంగ సభలు నిర్వహించాలనే విషయమై పార్టీ రాష్ట్ర నాయకత్వం రెండు రోజుల్లో ప్రణాళికను సిద్ధం చేయనున్నది. మరో రెండు వారాల్లో చిరంజీవి సబలు జోరుగా జరుగుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజమండ్రి సభ తరువాత హైదరాబాద్ చేరుకున్న చిరంజీవి వారం రోజులు ఇక్కడే ఉంటారు. ఇకపై ఆయన పాల్గొనే ప్రతి బహిరంగ సభ వైవిధ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సభల్లో ప్రత్యేక ఆకర్షణల కోసం మహిళారాజ్యం, యువరాజ్యం ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇకపై చిరంజీవి పాల్గొనే ప్రతి సభా ప్రజారాజ్యం పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఉండాలని అధినాయకత్వం నిర్ణయించినట్టు తెలిసింది.
Pages: -1- 2 News Posted: 12 March, 2009
|