ధోనీ 'బ్రాండ్' 300 కోట్లు!
ముంబై: ఇటీవల ఒక పెప్సీ వాణిజ్య ప్రకటనలో ధోనీ 'జాన్తా నహీఁ బాప్ కౌన్ హై?' అని అడుగుతూ పిల్లల చేతులలో నుంచి చివరి సీసాను లాక్కుంటాడు. భారత క్రికెట్ రంగస్థలిపై తుపానులా విరుచుకుపడిన వ్యక్తికి ఈ వాక్యం అనేక విధాలుగా నప్పుతుంది. అతనే బాస్. ఇండియాలో వాణిజ్య ప్రకటనలలో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ తలమానికం అయ్యాడు. తన చేతిలో సుమారు 19 బ్రాండ్ లతో ఆ 'బాస్' విలువ ఇప్పుడు అక్షరాలా 300 కోట్ల రూపాయలు.
న్యూజిలాండ్ లో తన నాయకత్వాన్ని, తన స్ట్రైక్ రేట్ ను యథాతథంగా కొనసాగించుకుంటూ మరొక వన్ డే సీరీస్ విజయాన్ని హస్తగతం చేసుకోవడంతో 'బ్రాండ్ ధోనీ'కి ఇక సాగగలిగింది ఒకే దిశలోనే. అదే మరింతగా ఉచ్ఛ స్థితికి చేరుకోవడమే. ధోనిని 'ది బాస్' చేస్తున్నదేమిటో తెలుసుకోవాలంటే 'బ్రాండ్ ఈక్విటీ (ది బాస్)' తాజా సంచికను చదవవలసి ఉంటుంది.
ప్రస్తుతం ధోనీ తన ప్రతి బ్రాండ్ కు 5 కోట్లు వసూలు చేస్తున్నాడు. ప్రతి కాంట్రాక్ట్ దాదాపుగా మూడు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అయితే, పెప్సీ, రీబాక్ వంటి బ్రాండ్ లు పదేళ్ళ వ్యవధికి కాంట్రాక్టులు కుదుర్చుకున్నాయి. దీనితో అతనిని ఆధారంగా చేసుకుని అవి ఇబ్బడి ముబ్బడిగా లాభాలు ఆర్జించేందుకు అవకాశాలు కలిగాయి. బ్రాండ్ ధోనీ అనతికాలంలోనే అగ్ర స్థానం చేరుకున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది నిజంగా ఘనమైనదే. 'ధోనీ స్వభావం, సంయమనం అతనిని ఆకట్టుకునేలా చేస్తున్నాయి. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా ఉండడం, దానికి తోడు జట్టు కెప్టెన్ గా బాధ్యత వహించడం నిజంగా సవాలే' అని సుప్రసిద్ధ చరిత్రకారుడు, క్రికెట్ వ్యాఖ్యాత రామచంద్ర గుహ పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 12 March, 2009
|