ధోనీ 'బ్రాండ్' 300 కోట్లు!
వాణిజ్య ప్రకటనలలో కనిపించడానికి సంబంధించినంత వరకు ఎస్ఆర్ కె (షారుఖ్ ఖాన్) తరువాత ధోనీ రెండవ స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ బాగా దూరంగా మూడవ స్థానంలో ఉన్నాడు. 2008లో టిఎఎం డేటా ప్రకారం ఎస్ఆర్ కె 5900 (వేల సెకన్లు చేర్చండి)తో అగ్ర స్థానంలో ఉండగా, ధోనీ 5272తో ద్వితీయ స్థానంలోను, సచిన్ 1787తో తృతీయ స్థానంలోను ఉన్నారు. అయినప్పటికీ, ధోనిని 'ది బాస్' చేస్తున్నది అతని క్రికెట్ సామర్థ్యం మాత్రమే కాదు. ఇంతవరకు అందరికీ తెలిసిన, టెక్స్ట్ బుక్ క్రికెట్ పద్ధతికి పూర్తిగా భిన్నమైనది ధోని తత్వం. ఝార్ఖండ్ కు చెందిన ఆ క్రికెటర్ ధోని అత్యంత ఫ్యాషన్ గా కూడా కనిపించడానికి ఇష్టపడతాడు.
అత్యంత సంక్లిష్టమైన బాధ్యతలలో ఒకటైన ఇండియాకు సారథ్యం వహించడమనే బాధ్యతను అతను సునాయాసంగానే నిర్వర్తిస్తున్నాడు. అయితే, ఒకప్పుడు ఆశ్రిత పక్షపాతానికి, వర్గ తత్వంతో కూడుకున్నదిగా పేరొందిన జట్టును సంఘటితంగా, సత్తా కనబరిచేదిగా, ఆటను ఎంజాయ్ చేసేదిగా అతను మలచగలిగాడు. 'ధోని అపరిమితమైన దృఢవిశ్వాసం, సంయమనం కనబరుస్తుంటాడు. 'ఎటువంటి భయమూ లేకుండా నన్ను నేను, నా జట్టును సమర్థిస్తాను' అని చెప్పగల వ్యక్తిత్వం అతనిది' అని ఫ్యూచర్ బ్రాండ్స్ సిఇఒ సంతోష్ దేశాయి వ్యాఖ్యానించారు.
Pages: -1- 2 News Posted: 12 March, 2009
|