ఈసారి టిక్కెట్లు మరీ ఖరీదు!
వామపక్షాలు, టిఆరెస్ పార్టీలు చేరడంతో బలం పుంజుకున్న తెలుగుదేశం పార్టీకి కూడా సిఎం రమేష్, 'సుజన'చౌదరి, గరికపాటి మోహనరావు తదితర కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలైన మదుపుదారులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ కు గతంలో ట్యూషన్లు చెప్పిన నారయణ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూట్ అధిపతి నారాయణ తెలుగుదేశం తరఫున సర్వేలు జరుపుతుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక టిఆరెస్ లో అధ్యక్షుడు చంద్రశేఖర రావు, ఆయన సన్నిహితులే నిధుల వ్యవహారాలు స్వయంగా చూసుకుంటారు. విశేషం ఏమిటంటే, చంద్రబాబుకు మిత్రడైన సిఎం రమేష్ చంద్రశేఖర రావుకు కూడా అత్యంత సన్నిహితుడే!
ప్రజారాజ్యం పార్టీ విషయానికి వస్తే, పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రసిద్ధ నిర్మాత అల్లు అరవింద్, చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన ఎన్నారై శ్రీనాథ్ నిధుల వేటలో ప్రధాన పాత్రధారులు. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ నాలుగైదు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టవలసి వస్తుందని కాబోయే అభ్యర్ధులకు ఇంటర్వ్యూ సమయంలోనే ప్రజారాజ్యం నాయకత్వం స్పష్టంగా చెప్పినట్టు పుకార్లు వినిపించాయి. అయితే వాటిని పార్టీ ఖండించి, అభ్యర్ధుల ఎంపికకు డబ్బు ఎంతమాత్రం ముఖ్యం కాదని స్పష్టం చేసింది. ఇటువంటి 'సంపాదనా పరుల'కే పార్టీలో విపరీతమైన పలుకుబడి ఉంటుందనీ, టిక్కెట్ల పంపిణీలో వారి మాటే చెల్లుతుందనీ అన్ని పార్టీల నాయకులూ ముక్తకంఠంతో చెబుతున్నారు.
Pages: -1- 2 News Posted: 13 March, 2009
|