సత్యం ఫ్రెషర్స్ సంస్థ షురూ
ఎస్ఎఫ్ యూలోని 8 వేల మంది సభ్యుల్లో దాదాపు 2 వేల మంది 2007 ఏప్రిల్ లో గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేశారు. మరో 6 వేల మంది 2008లో గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసారు. 2007 అక్టోబర్ లోను, 2008 మే లోను వారు కంపెనీ నుండి ఆఫర్ లెటర్సును పొందారు. ఆప్పటి నుండి వారు సత్యం కంప్యూటర్స్ లో ఉద్యోగం చేసేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు. సత్యంలో బయటపడిన 7,800 కోట్ల రూపాయల కార్పొరేట్ కుంభకోణం కారణంగా ఆ కంపెనీ హెచ్ ఆర్ నియామకాలన్నిటిని నిలిపివేసింది. అయితే కంపెనీ అధికారులు ఎస్ఎఫ్ యూ పిటిషన్ల పట్ల ఎలాంటి నిబద్ధతను ప్రకటించలేదు.
సత్యం సంస్థలో అంతర్గత సంక్షోభమే కాదు, ప్రపంచ వ్యాప్త ఆర్దిక సంక్షోభం కూడా బాగా దెబ్బతీసిందని సత్యం అధికార ప్రతినిధి తెలిపారు. కష్టాల్లో ఉన్న కంపెనీ భవితవ్యం తేలే వరకు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోరాదని కంపెనా బోర్డు నిర్ణయించింది. 'వ్యూహాత్మక బిడ్డర్ విషయం తేలిపోయిన వెంటనే ఇలాంటి సమస్యలపై దృష్టి సారిస్తాము. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు రద్దై కంపెనీ తన కాళ్ళ మీద తాను నిలబడగలిగిన సమయంలో ఇలాంటి వాటి పట్ల ఒక నిర్ణయం తీసుకుంటాము.'అని సత్యం అధికార ప్రతినిధి తెలిపారు. ఏప్రిల్ 1 తో వారు ఫ్రెషర్స్ స్టేటస్ ను కోల్పోతుండడంతో ఎస్ఎఫ్ యూ సభ్యులు చాలా ఆందోళన చెందుతున్నారు.
Pages: -1- 2 News Posted: 13 March, 2009
|