వోటింగ్ మెషీన్లో టైమర్లు
2009 లోక్ సభ ఎన్నికల కోసం బెల్ టైమర్లతో 1,02,000 ఇవిఎంలను పంపిందని, ఆరు నెలల క్రితం ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తమకు ఆర్డర్లు వచ్చిన తరువాత అదే సంఖ్యలో బ్రెయిలీ ఇవిఎంలను కూడా పంపామని బాదోరియా తెలియజేశారు. ఇసిఐఎల్ కూడా అదే సంఖ్యలో ఇవిఎంలను సమకూర్చింది. ఒక్కొక్క ఇవిఎం ఖరీదు రూ. 9800. ఇందులో పన్ను, ఎక్సైజ్ సుంకం చేరి ఉన్నాయి. ఇవిఎంలను పంపేందుకు బెల్ కు దాదాపు మూడు నెలలు పడుతుంది.
ఇవిఎంలను భారతదేశంలో తొలిసారిగా కేరళలో 1982లో జరిగిన ఒక ఉప ఎన్నికలలో పరీక్షించారు. అప్పటి నుంచి బెల్, ఇసిఐఎల్ ప్రయోగాత్మక కార్యక్రమాలకు, పంచాయతీ స్థాయి నుంచి లోక్ సభ వరకు వివిధ ఎన్నికల కోసం ఇవిఎంలను సరఫరా చేస్తూనే ఉన్నాయి. దేశం ఎన్నికలలో డిజిటల్ యంత్రాల వాడకానికి ఉపక్రమించినప్పటి నుంచి ఆ రెండు సంస్థలూ సుమారు 15 లక్షల ఇవిఎంలను సరఫరా చేశాయి. 2004 లోక్ సభ ఎన్నికలలో వీటిని దేశవ్యాప్తంగా ఉపయోగించారు. కంపెనీ టెక్నీషియన్లు ప్రతి ఎన్నికకు ముందు ఇవిఎంలను తనిఖీ చేసి పాడైపోయిన భాగాలను, బ్యాటరీలను మారుస్తారు.
ఇప్పుడు ఇవిఎంలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ప్రభుత్వం నేపాల్ కు 470 ఇవిఎంలను దానం చేసింది. నమీబియా 1700 ఇవిఎంల కోసం ఆర్డర్ ఇచ్చింది. నమీబియా నుంచి అడ్వాన్స్ అందిన తరువాత వాటిని తయారు చేసి ఎగుమతి చేయనున్నట్లు బాదోరియా తెలిపారు. మలేషియా, మరికొన్ని దేశాలు కూడా ఇవిఎంల పట్ల ఆసక్తిని కనబరిచాయి. ఈ దేశాల నుంచి ప్రతినిధివర్గాలు వచ్చి ఇవిఎంలను పరీక్షించి తమ అవసరాలకు తగినట్లుగా డిజైన్ లో కొన్ని మార్పులు చేయాలని కోరాయి.
Pages: -1- 2 News Posted: 13 March, 2009
|