యువ'తరం'గ్ దే జమానా!
ఆయా పార్టీలలోని తదుపరి తరం నాయకులను ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే ఈ విషయం విదితమవుతుంది. కాంగ్రెస్ తన భవిష్యత్తును అన్యథా శరణం నాస్తి అన్నట్లుగా 39 సంవత్సరాల రాహుల్ గాంధీ చేతుల్లో పెట్టింది. బిజెపిలో అరుణ్ జైట్లీ (57), నరేంద్ర మోడి (59) కీలక నేతలుగా ఆవిర్భవించారు. వారు చాలా సంవత్సరాల పాటు కాషాయ శిబిరం రాజకీయాలలో ఆధిపత్యం వహించగలరు.
ప్రాంతీయ పార్టీలు కూడా ఈ విషయంలో ఏమీ తీసిపోలేదు. జెడి (యు) అధికార కేంద్రం కాగల నాయకుడు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (58). బిఎస్ పికైతే మాయావతే (53) దిక్కు. శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే వయస్సు 49 మాత్రమే. సిపిఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ వయస్సు 61 సంవత్సరాలు కాగా ఆయన కుడిభుజం సీతారామ్ ఏచూరి 57 ఏళ్ళ వయస్కుడు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వయస్సు 54. తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వయస్సు 59 సంవత్సరాలు.
ఇప్పటికి కొంత కాలంగా ఈ మార్పు చోటు చేసుకుంటుండగా 2009 ఎన్నికలు ఈ ప్రక్రియకు ముగింపు పలకవచ్చు. దీని ప్రభావం నాటకీయంగానే ఉండవచ్చు. 'ప్రతి తరం రాజకీయ చర్చలో తన ఆందోళనలను ప్రస్తావిస్తుంటుంది' అని కాంగ్రెస్ లోని యువనేతలలో ఒకరైన మనీష్ తివారి పేర్కొన్నారు. 'అందుకే, విద్య, ఆరోగ్యం వంటి సామాజిక అంశాలు, వాతావరణం మార్పు వంటి సమకాలీన సమస్యలు చర్చలలో ప్రధానంగా చోటు చేసుకునేట్లు చూస్తాం' అని మనీష్ తివారి చెప్పారు.
Pages: -1- 2 News Posted: 13 March, 2009
|