కొత్త షెడ్యూలు కోరిన హోం మంత్రి
తమ పోలీసు శాఖాధిపతుల వినియోగార్ధం కనీసం ఐదు లేక ఆరు కంపెనీల (500-600 సిబ్బంది) పారా మిలిటరీ దళాలను కేటాయిస్తే, ఐపిఎల్ మ్యాచ్ ల నిర్వహణకు అభ్యంతరం లేదని, తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాలు హోం శాఖకు తెలియజేశాయని అధికార వర్గాలు వెల్లడించాయి. తమ రాష్ట్రంలో మ్యాచ్ ల నిర్వహణకు ససేమిరా వీల్లేదని తమిళనాడు ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఐపిఎల్ సవరించిన షెడ్యూలుకు సమాధానం కోరిన మీదట రాష్ట్ర ప్రభుత్వాలు పై విధంగా ప్రతిస్పందించాయి. కేంద్ర భద్రతా దళాల సహాయంతో మాత్రమే పోటీలను ప్రశాంతంగా నిర్వహించడం సాధ్యమవుతుందని రాష్ట్రాలు అభిప్రాయపడినట్టు హోం శాఖ సీనియర్ అధికారులు చెప్పారు. ఆ తరువాతనే కొత్త షెడ్యూలును సమర్పించాలని ఐపిఎల్ నిర్వాహకులకు హోం మంత్రి తాజాగా తాకీదు పంపించారు.
Pages: -1- 2 News Posted: 13 March, 2009
|