అరుణ్ జైట్లీ అలిగారు!
పార్టీలో అన్ని తరహాల వ్యక్తులు ఉన్నారని, 'మనమంతా ప్రతి ఒక్కరినీ ఇష్టపడలేం కదా' అని సుష్మా స్వరాజ్ అన్నట్లు, అయితే, ఈ విషయాలను అధ్యక్షునితో చర్చించాలని ఆమె సూచించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. కాగా, ఎన్నికల ముందు ఈ వ్యతిరేక ప్రచారం మంచిది కాదంటూ వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రచార కమిటీ ఇన్ చార్జి సమావేశానికి హాజరై ఉండవలసిందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్లు ఆ వర్గాలు తెలియజేశాయి. అయితే, ప్రథమార్ధంలో సమావేశానికి హాజరు కాని జైట్లీ మధ్యాహ్నం కమిటీ తిరిగి సమావేశమైనప్పుడు కూడా రాలేదు. మిట్టల్ కు ఉద్వాసన పలికేంత వరకు ఈ కమిటీ సమావేశాలకు జైట్లీ హాజరు కాబోరని, కాని పార్టీలోని ఇతర వేదికల సమావేశాలకు ఆయన హాజరు కాగలరని ఆ వర్గాలు చెప్పాయి. అద్వానీ మద్దతు ఉన్నప్పటికీ జైట్లీ మరీ అతిగా వ్యవహరించారని కొందరు నాయకులు వ్యాఖ్యానించారు.
స్వర్గీయ ప్రమోద్ మహాజన్ కు సన్నిహితుడుగా పేరొందిన మిట్టల్ ను లాంఛనంగా కొన్ని రోజుల క్రితం అసోం ఇన్ చార్జి ఎస్.ఎస్. అహ్లూవాలియాకు సహాయకుడుగా నియమించారు. మిట్టల్ అంటే వ్యక్తిగతంగా ఇష్టపడని జైట్లీ తన అసంతుష్టిని పార్టీకి తెలియజేశారు కూడా. అయితే, సీట్ల పంపకంపై అసోం గణ పరిషత్ (ఎజిపి)తో సంప్రదింపుల సందర్భంగా వివాదాలు నెలకొన్న దృష్ట్యా మిట్టల్ నియామకం తప్పనిసరి అయిందని పార్టీ కేంద్ర నాయకత్వం వివరించింది. ఎజిపితో పొత్తుపై చర్చలకు పరిస్థితులను సానుకూలం చేసిన వారిలో మిట్టల్ ఒకరు. బిజెపితో ఎటువంటి అవగాహననైనా వ్యతిరేకిస్తున్న ఎజిపిలోని ఒక వర్గం 'ఢిల్లీ వాణిజ్యవేత్తకు' సీట్లను అమ్ముకున్నారని పార్టీ నేత చంద్ర మోహన్ పటోవారిపై ఆరోపణలు చేసింది.
మిట్టల్ కు లాంఛనంగా బాధ్యతలను అప్పగించవలసిందిగా బిజెపిపై పటోవారి ఓత్తిడి తీసుకువచ్చారు. మిట్టల్ పవర్ బ్రోకర్ అని, బిజెపితో ఆయనకు ఎటువంటి సంబంధమూ లేదని అప్పుడు జైట్లీ అన్నట్లు కొన్ని వార్తాపత్రికలు తెలియజేశాయి. ఎజిపి ఈ ప్రకటనను నిరసించి, ఈ పరిస్థితిని సరిదిద్దవలసిందిగా బిజెపిని కోరింది. ఒరిస్సా పరిణామం అసోంలో పునరావృతం కాకుండా చూసేందుకు బిజెపి మిట్టల్ ను తోటి ఇన్ చార్జిగా నియమించింది. ఈ నిర్ణయం గురించి అద్వానీకి కూడా తెలుసునని బిజెపి వర్గాలు చెప్పాయి.
Pages: -1- 2 News Posted: 14 March, 2009
|