డబుల్ సిమ్ పై రామబాణం!
స్పైస్ మొబైల్ కాకుండా డ్యుయెల్-సిమ్ ఫోన్లను దిగుమతి చేసుకుంటున్న సంస్థలలో శామ్సంగ్, రీడిఫ్, ఇబే, ఫ్లై మొబైల్ వంటి కంపెనీలు, చైనా, తైవాన్ నుంచి చౌకగా, అన్ బ్రాండెడ్ హ్యాండ్ సెట్లను అధిక సంఖ్యలో తీసుకువచ్చే చిన్న సంస్థలు ఉన్నాయి. క్రితం సంవత్సరం ఫిబ్రవరిలో తనకు మంజూరైన పేటెంట్ ఆధారంగా రామకుమార్ చెన్నైవిమానాశ్రయం కస్టమ్స్ విభాగాన్ని ఆశ్రయించిన తరువాత ఆ సరకుల నిలిపివేత జరిగింది. తాము స్వయంగా నిర్థారించుకున్న తరువాత చెన్నై కస్టమ్స్ విభాగం ఆయన క్లెయిమ్ ను అంగీకరించి ఈ సంవత్సరం మార్చి 2న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
'మొబైల్ హ్యాండ్ సెట్ టెక్నాలజీకి సంబంధించిన మొత్తం సమాచారం'పై తాను నూటికి పైగా పేటెంట్లు దాఖలు చేశానని, అన్నీ కూడా ఇంటిలో తాను చేసిన పరిశోధనల ఫలితమేనని రామకుమార్ తెలియజేశారు. మదురై స్వస్థలమైన రామకుమార్ ఈ సారి హైకోర్టు ద్వారా తన హక్కుల అమలు కోసం చెన్నైలోనే ప్రస్తుతం మకాం వేస్తున్నారు. మరి ఉత్పత్తిదారులు, దిగుమతిదారుల నుంచి రాయల్టీని సంపాదించడమే ఆయన ధ్యేయమా అని ప్రశ్నించినా ఆయన సమాధానం చెప్పరు. వాస్తవానికి 'రాయల్టీ' లేదా 'వసూళ్ళు' లేదా 'వాణిజ్యపరమైన ఉపయోగం' గురించి మాట్లాడడానికి ఆయన ఇష్టపడడం లేదు.. అయితే, 'పరిశ్రమతో సంబంధాలు పెట్టుకోవడానికి, వీటిని (పేటెంట్లను) ముందుకు తీసుకుపోవడానికి ' తన మిత్రులు తనకు సాయం చేస్తున్నారని ఆయన అంగీకరించారు.
'డబ్బు కన్నా కూడా అక్రమ దిగుమతులను నిరోధించడానికి ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధ హ్యాండ్ సెట్ల ఉత్పత్తి సంస్థలతో చేతులు కలపడం' ఆయన వ్యూహం. అయినప్పటికీ, ఈ పరిణామానికి ఎలా స్పందించాలో కూడా డ్యుయెల్-సిమ్ హ్యాండ్ సెట్ల ఉత్పత్తి సంస్థలు, దిగుమతి సంస్థలకు అంతుపట్టడం లేదు. హ్యాండ్ సెట్ ఉత్పత్తి సంస్థలు, విక్రేతల సంఘం ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ (ఐసిఎ) ఈ సమస్య పరిష్కారం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలియవచ్చింది.
Pages: -1- 2 -3- News Posted: 16 March, 2009
|