డబుల్ సిమ్ పై రామబాణం!
ఆ సంఘం నుంచి అధికారిక వ్యాఖ్య ఏదీ వెలువడడం లేదు కనుక పేటెంట్ హోల్డర్ తో నేరుగానే తేల్చుకోవాలని అది కోరుకుంటున్నట్లు తెలుస్తున్నది. అయితే, పేటెంట్ గురించి తెలుసునని మాత్రమే సంఘం జాతీయ అధ్యక్షుడు పంకజ్ మహీంద్రూ తెలిపారు. దిగుమతి చేసుకున్న సరకులు విమానాశ్రయంలో నిలచిపోయిన స్పైస్ కు, ప్రపంచంలో సెల్ ఫోన్లను తయారు చేసే భారీ సంస్థ నోకియాకు ఎఫ్ సి ఇ-మెయిల్స్ పంపినా అవి స్పందించలేదు.
'వివిధ కమ్యూనికేషన్ నెట్ వర్క్ లకు కేటాయించిన రకరకాల సిమ్ కార్టులతో ఫోన్ల'పై పేటెంట్ కోసం రామకుమార్ 2002లోనే దరఖాస్తు దాఖలు చేశారు. మొబైల్ హ్యాండ్ సెట్ పరిశ్రమలోను, వ్యాపార రంగంలోను ఎవరూ ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. అందుకు ఇప్పుడు వారు కొంత మూల్యం చెల్లించుకోవలసి వస్తున్నది. మొబైల్ ఫోన్ మార్కెట్ లో కొద్ది భాగాన్నే ఆక్రమిస్తున్నప్పటికీ డ్యుయెల్-సిమ్ హ్యాండ్ సెట్లు క్రమంగా జనాదరణను పొందుతున్నాయి. అటువంటి హ్యాండ్ సెట్లు అన్నిటినీ దిగుమతి చేసుకుంటున్నారు. అనధికార అంచనాల ప్రకారం, రోజూ ఒక చెన్నై విమానాశ్రయం ద్వారానే దాదాపు 8000 హ్యాండ్ సెట్లు వస్తుంటాయి. ముంబై ద్వారా 15 వేలు, డిల్లీ ద్వారా 10 వేలు హ్యాండ్ సెట్లు వస్తుంటాయి.
ఈ మార్కెట్, డ్యుయెల్-సిమ్ ఫోన్ దిగుమతిదారులు, తయారీదారులు ఎదుర్కొంటున్న సమస్య పరిమాణాన్ని ఇది సూచిస్తున్నది. (అయితే, అన్ని ఎంట్రీ కేంద్రాల ద్వారా జరిగే దిగుమతులకు సంబంధించిన కచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవు). ఉత్పత్తిదారు సంస్థలు చక్కని అవకాశాన్ని కోల్పోయినట్లు కనిపిస్తున్నది. పేరు చెప్పడానికి ఇష్టపడని పరిశ్రమ ప్రతినిధి ఒకరు డ్యుయెల్ సిమ్ హ్యాండ్ సెట్ల పై పేటెంట్ ను ఏ ఉత్పత్తి సంస్థా తీసుకోకపోవడం విచిత్రమని భావిస్తున్నారు. 'ఈ టెక్నాలజీతో పరిశ్రమ ప్రయోగాలు మాత్రమే చేస్తున్న సమయంలో రామకుమార్ పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు' అని ఆయన అన్నారు.
చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారి ఒకరి సమాచారం ప్రకారం, కస్టమ్స్ శాఖ నోటిపికేషన్ జారీ అయిన తరువాత దిగుమతులు నిలిపివేయవచ్చు. సర్క్యూట్ బోర్డ్, సిమ్ సాకెట్, సిమ్ కార్డుతో సహా దాదాపు 20 విడి భాగాలకు ఈ పేటెంట్ ఉత్తర్వు వర్తిస్తున్నందున, ఈ విడిభాగాలలో దేనితోనైనా ఒక్కొక్క డ్యుయెల్-సిమ్ హ్యాండ్ సెట్ దిగుమతిని రామకుమార్ నిలిపివేయవచ్చునని, ఆయన రాయల్టీ కూడా కోరవచ్చునని ఆ అధికారి పేర్కొన్నారు. తాను పేటెంట్ల కోసం దరఖాస్తు చేసిన మొబైల్ హ్యాండ్ సెట్ లోని అన్ని విడిభాగాలకు సంబంధించిన టెక్నాలజీపై ఏ కంపెనీ కూడా పేటెంట్ పొందలేదని ఆ 'శోధకుడు' చెబుతున్నారు. ఇప్పటికే తనకు మంజూరైన భారతీయ పేటెంట్ ను ఇతర దేశాలలో ఉత్పత్తి సంస్థలు అంగీకరిస్తాయా అనేది పూర్తిగా భిన్నమైన విషయం.
Pages: -1- -2- 3 News Posted: 16 March, 2009
|