లోకేష్ కు పార్టీ బాధ్యతలు
ఎన్టీఆర్ కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ కన్నా సినీ నటుడు బాలకృష్ణ అల్లుడు కూడా అయిన లోకేష్ నాయుడుకు ప్రాముఖ్యం ఇవ్వడం సబబేనని పార్టీ నాయకులు భావిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఉధృత స్థాయిలో సాగుతున్న ప్రచారాన్ని పరిగణనలోకి తీసుకుంటున్న పార్టీ నాయకులు జూనియర్ ఎన్టీఆర్ జనాన్ని ఆకర్షించడంలో పార్టీ వ్యవస్థాపకునికి నిజమైన వారసుడు అనిపించుకున్నారని భావిస్తున్నారు. 'ఆయన తన తాతగారిలా జనాకర్షణ శక్తిని, ఉపన్యాస నైపుణ్యం కలిగి ఉన్నారు. తన ప్రసంగాలకు జనాన్నిఎలా స్పందింపచేయాలో ఆయనకు తెలుసు' అని వెటరన్ పార్టీ నాయకుడు ఒకరు పేర్కొన్నారు.
హరికృష్ణ కుమారుడైన ఆ యువ నటుడు అచ్చుగుద్దినట్లుగా ఎన్టీఆర్ లా ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ వల్ల పార్టీ నేతకు వెంటనే వచ్చే ముప్పు ఏమీ లేదని చంద్రబాబుకు సన్నిహితులైన పార్టీ నాయకులు అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన సినీ జీవితాన్ని త్యాగం చేసి రాజకీయాలలో కొనసాగజాలరని వారంటున్నారు. అయినా, 'ఎన్నికల అనంతరం జనంతో ఎలా వ్యవహరించాలో మా నేతకు బాగా తెలుసు' అని టిడిపి నాయకుడు ఒకరు అన్నారు.
Pages: -1- 2 News Posted: 16 March, 2009
|